కార్టూన్లు గీయడం నా అవ్యసనం.. నవ్వొచ్చే కార్టూన్లు గీయడం నా బలహీనత.. దీన్నుంచి బయటపడదామని చాన్నాళ్ళుగా చూసి నవ్వుల పాలయ్యాను. కొన్ని నవ్వురాని కార్టూన్లు గీశాను. అవి చూసి అందరూ నవ్వుకున్నారు. 'చేతగాని కార్టూన్లు గీయడం ఎందుకురాభై' అని ఎద్దేవా చేశారు. అప్పటి నుంచీ ఒకటే డిసైడైపోయా. కష్టమో నష్టమో నవ్వొచ్చే కార్టూన్లే గీద్దామని. కానీ నా అంచనాలన్నీ తలకిందులై పోయాయి. నవ్వొచ్చే కార్టూన్లకి కూడా ఆదరణ మొదలైంది.
నవ్విన నాపచేనే విరగ పడింది. కొమ్మలు తిరిగిన సెన్సాఫ్ హ్యూమరిస్టులు, కరుడుగట్టిన కార్టూనిస్టులు కూడా నీ కార్టూన్లు బాగుంటాయ్ అని నిర్మొహమాటంగా అనేశారు. ముఖ పుస్తకంలో కూడా కొంతమంది ముఖం మీదే మెచ్చుకున్నారు. వీరాభిమానులమని మెసేజు బాక్సులో పెట్టారు. ఇందుకు నా దగ్గర బలమైన సాక్ష్యాదారాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ పుస్తకం పేరుకూడా నిసిగ్గుగా 'నవ్వొచ్చేకార్టూన్లు' అని పెట్టాను ఏమైతే అదయిందని.
కార్టూన్లు గీయడం నా అవ్యసనం.. నవ్వొచ్చే కార్టూన్లు గీయడం నా బలహీనత.. దీన్నుంచి బయటపడదామని చాన్నాళ్ళుగా చూసి నవ్వుల పాలయ్యాను. కొన్ని నవ్వురాని కార్టూన్లు గీశాను. అవి చూసి అందరూ నవ్వుకున్నారు. 'చేతగాని కార్టూన్లు గీయడం ఎందుకురాభై' అని ఎద్దేవా చేశారు. అప్పటి నుంచీ ఒకటే డిసైడైపోయా. కష్టమో నష్టమో నవ్వొచ్చే కార్టూన్లే గీద్దామని. కానీ నా అంచనాలన్నీ తలకిందులై పోయాయి. నవ్వొచ్చే కార్టూన్లకి కూడా ఆదరణ మొదలైంది. నవ్విన నాపచేనే విరగ పడింది. కొమ్మలు తిరిగిన సెన్సాఫ్ హ్యూమరిస్టులు, కరుడుగట్టిన కార్టూనిస్టులు కూడా నీ కార్టూన్లు బాగుంటాయ్ అని నిర్మొహమాటంగా అనేశారు. ముఖ పుస్తకంలో కూడా కొంతమంది ముఖం మీదే మెచ్చుకున్నారు. వీరాభిమానులమని మెసేజు బాక్సులో పెట్టారు. ఇందుకు నా దగ్గర బలమైన సాక్ష్యాదారాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ పుస్తకం పేరుకూడా నిసిగ్గుగా 'నవ్వొచ్చేకార్టూన్లు' అని పెట్టాను ఏమైతే అదయిందని.© 2017,www.logili.com All Rights Reserved.