ద్రౌపది లేని భారతం
ఆనాడు అక్బరు చక్రవర్తికి ఒక పెద్ద ఆలోచన వచ్చింది. ఆయన వెంటనే వీరబలుణ్ణి పిలిచి తన ఆలోచన చెప్పాడు. “వీరబల్! మేము రామాయణం విన్నాం, భారతం విన్నాం, భాగవతం విన్నాం. అన్నిటి కంటే పాండవుల కథ ఉన్న భారతం కథ అంటే మాకు బాగా పసందు అయింది. నిజంగా అది పాండవుల కీర్తిని ప్రపంచంలో శాశ్వతంగా నిలిపింది. ఆ విధంగానే మా కీర్తి కూడా ప్రపంచంలో శాశ్వతంగా ఉండాలని మా కోరిక. అందుకోసం నీ చేత మా పేరుతో ఒక కొత్త భారతం వ్రాయించాలని అనుకుంటున్నాం. పాండవుల లాగే మేము కూడా భారతదేశం అంతా పరిపాలిస్తున్నాం కాబట్టి నీవు 'అక్బరు భారతం' వ్రాయాలని మా అభీష్టం. అందుకేమంటావు?" అన్నాడు అక్బరు పాదుషా.
వీరబలుడు కొంచెం సేపు ఆలోచించాడు. “జహాపనా! అక్బరు భారతం వ్రాయటం అంత కష్టమైన పనేమీ కాదు. అయితే అందుకు చాలా ధనం ఖర్చు అవుతుంది. అందుకు మీరు అంగీకరిస్తే ఆరు మాసాలలో అక్బరు భారతం రచించి తెస్తాను" అన్నాడు వీరబలుడు.
అక్బరు పాదుషా వెంటనే అందుకు అంగీకరించాడు. వీరబలుడికి కోరినంత ధనం కోశాగారం నుంచి తెప్పించి ఇప్పించాడు. వీరబలుడు ధనం అందుకొని కాలక్షేపం చేస్తున్నాడు.
ఆరు మాసాలూ పూర్తి కావస్తున్నవి. వీరబలుడు ఒక పెద్ద గ్రంథం తయారు చేశాడు. పైనా కిందా గట్టి అట్టలు పెట్టి పుస్తకం మాత్రం అందంగా కుట్టాడు. అయితే అందులో ఒక్క అక్షరం ముక్క కూడా వ్రాయలేదు. పాదుషావారి దర్బారుకు మాత్రం అప్పుడప్పుడు ఆ పుస్తకం పట్టుకొని వెళుతూ ఉండేవాడు.
ఒకనాడు అక్బరు పాదుషా వీరబలుడి దగ్గర పుస్తకం చూసి అడిగాడు. "ఏం వీరబలి. మా భారతం పూర్తి అయిందా?"
“చాలా వరకు అయిపోయింది హుజూర్. కాని ఒక్కచోట మాత్రం అనుమానం వచ్చి రచన 'ఆగిపోయింది. ఇక పూర్తి కావాలంటే ఆ అనుమానం తీరాలి. అందుకోసం నాకు ఒక్కసారి మహారాణిగారి దర్శనం కావాలి” అన్నాడు వీరబలుడు.
దానికేముంది అలాగే ఏర్పాటు చేస్తాం" అన్నాడు అక్బరు చక్రవర్తి. వెంటనే ఆయన రాణిగారిని దర్శించటానికి వీరబలుడికి అనుమతి ఇచ్చాడు.
© 2017,www.logili.com All Rights Reserved.