లక్ష్మీగణపతి
“గిర్ గిర్ గిర్ గిర్"
కడవలో కవ్వం తిరిగినట్లు కడలిలో మందర పర్వతం గిర్రుగిర్రున తిరుగుతున్నది. తరుణీమణులు దధి చిలికినట్లు సురాసురులు ఉదధిని మథిస్తున్నారు. మందరగిరిని కవ్వంగా చేసి, సర్వరాన వాసుకిని త్రాడుగా చేసి దేవతలూ రాక్షసులూ ఇరువైపులా నిలిచి క్షీరసాగరాన్ని చిలుకుతున్నారు.
అలా మధించితే ఉదధిలో నుంచి అమృతం పుడుతుందనీ, అమృతం తాగితే మరణం అనేది లేకుండా చిరంజీవులుగా ఉండవచ్చుననీ ఆశతో ఆకాంక్షతో అచంచల దీక్షతో వారు ఆ విధంగా శ్రమపడుతున్నారు.
మదించగా, మధించగా మహాసముద్రమధ్యం నుంచి అమృతానికి బదులు హాలాహలమనే | భయంకర విషం పుట్టింది. సురాసురులందరినీ చుట్టుముట్టింది. ఆ విషాగ్ని జ్వాలలకు ఆగలేక వారంతా వాసుకిని వదిలిపెట్టి హాహాకారాలు చేస్తూ చెల్లాచెదరై పరుగెత్తారు.
లక్ష్మీగణపతి “గిర్ గిర్ గిర్ గిర్" కడవలో కవ్వం తిరిగినట్లు కడలిలో మందర పర్వతం గిర్రుగిర్రున తిరుగుతున్నది. తరుణీమణులు దధి చిలికినట్లు సురాసురులు ఉదధిని మథిస్తున్నారు. మందరగిరిని కవ్వంగా చేసి, సర్వరాన వాసుకిని త్రాడుగా చేసి దేవతలూ రాక్షసులూ ఇరువైపులా నిలిచి క్షీరసాగరాన్ని చిలుకుతున్నారు. అలా మధించితే ఉదధిలో నుంచి అమృతం పుడుతుందనీ, అమృతం తాగితే మరణం అనేది లేకుండా చిరంజీవులుగా ఉండవచ్చుననీ ఆశతో ఆకాంక్షతో అచంచల దీక్షతో వారు ఆ విధంగా శ్రమపడుతున్నారు. మదించగా, మధించగా మహాసముద్రమధ్యం నుంచి అమృతానికి బదులు హాలాహలమనే | భయంకర విషం పుట్టింది. సురాసురులందరినీ చుట్టుముట్టింది. ఆ విషాగ్ని జ్వాలలకు ఆగలేక వారంతా వాసుకిని వదిలిపెట్టి హాహాకారాలు చేస్తూ చెల్లాచెదరై పరుగెత్తారు.© 2017,www.logili.com All Rights Reserved.