జ్యోతిష శాస్త్రము వేదములలో భాగము. ఈ జ్యోతిషము మహా ఋషుల తపస్సు చేతనో, వారి దివ్యదృష్టి చేతనో, వారు ఖగోళము శోధన చేసి, గ్రహ సంచారము నుండి కాలగమనము తెల్పుతూ గ్రహముల సంచార భేదములు, వాటివల్ల జరిగే ఫలములను, మంచి చెడ్డలను వివరించి చెప్పుటచే జ్యోతిషము సముద్ర యానము వంటిది. ఎంత నేర్చినా ఫల భాగములో సందేహముగానే యుండును. గ్రహముల గమనములో రవి, చంద్రుల సంచారములో కాలమును, వార, తిధి, పక్ష, మాస, సంవత్సరములుగా విభజన చేయుటను తెల్పుచూ, గ్రహ సంచారములో రవి, చంద్రులు తప్ప కుజాది పంచ గ్రహములు సంచారములో వక్రాది గతులు, దృష్టులు, ఫలము తెల్పుటచే ఈ సముద్రములో ప్రయాణము చేయుటలో శాస్త్రమున పూర్ణ ప్రజ్ఞ కలుగుట కష్టతరము.
- హనుమంతవరఘుల వీర వెంకట సుబ్రహ్మణ్య శర్మ