మామూలుగా ఆరోగ్యంగా ఉండే పిలావాడికెవడికైనా ఈనాడు సెకండరీ విద్య బోధించవచ్చు. పిల్లల్ని తెలివైన వాళ్ళూ, మంద బుద్దులూ అని విభజించనవసరం లేదు. ఈ అభిప్రాయాలు కొత్తవేం కాకపోయినా దృడంగా నమ్మి సిద్ధాంతరీత్యా, ఆచరణ రీత్యా రుజువు పరచిన వ్యక్తి వి.ఎ. సుహోమ్లీన్ స్కీ.
పెంపకాన్నీ, బోధననీ ఒకే విద్యాక్రమంలో మిళితం చెయ్యాలని చాలా కాలంగా అభ్యుదయ అధ్యాపకులు కన్న కలలను తన కృషి ద్వారా సాకారం చేసిన వ్యక్తి సుహోమ్లీన్ స్కీ తన జీవితమంతా విద్యాబోధనకే అంకితం చేశాడు. సమాజం కేంద్రంగానే పిల్లల్ని పెంచాలన్న మకరెంకో సమష్ఠ బోధనాసిద్ధాంతాన్నిఆచరణలో సాధించారు. ఉన్నత నైతిక విలువలూ, పౌరధర్మం ఆధారంగా ఉండే విద్యావిధానం రూపొందాలని ఆశించాడు. పిల్లలకు బోధించాలనుకున్న అధ్యాపకుడికి సహజంగా పిల్లలంటే ఇష్టపడే తత్వం. పిల్లవాడి హృదయాన్ని అన్వేషించే లక్షణం ఉండాలంటాడు. పిల్లలు తమ కుటుంబాన్నీ, పాఠశాలనీ, పనినీ, జ్ఞానాన్నీ, మాతృదేశాన్నీ ప్రేమించేలా ఉపాధ్యాయుడు బోధించగలడన్నది సుహోమ్లీన్ స్కీ నమ్మకం. పవ్లీష్ లోని విద్యాలయం అధిపతిగా ఇతడు తన అభిప్రాయాలను సాధించి చూపాడు. అనేక గ్రంథాలు రాశాడు. వాటిల్లో 'పిల్లలకే నా హృదయం అంకితం' అన్న గ్రంథానికి విశేష ప్రాచుర్యం లభించింది. మహా బోధకుని పుష్కలమైన ఆచరణ యోగ్యమైన అనుభవసారం ఈ గ్రంథం. వీరి కృషికి గుర్తింపుగా 'సోషలిస్టు శ్రమవీరుడు', 'ఉత్తమ ఉపాధ్యాయుడు' వంటి అనేకానేక సోలియాట్ ఉన్నత పురస్కారాల౦దాయి.
ఉపాధ్యాయులు తన హృదయాన్ని పిల్లలకే అందజేయాలన్న సందేశం మనకందించారు.
మామూలుగా ఆరోగ్యంగా ఉండే పిలావాడికెవడికైనా ఈనాడు సెకండరీ విద్య బోధించవచ్చు. పిల్లల్ని తెలివైన వాళ్ళూ, మంద బుద్దులూ అని విభజించనవసరం లేదు. ఈ అభిప్రాయాలు కొత్తవేం కాకపోయినా దృడంగా నమ్మి సిద్ధాంతరీత్యా, ఆచరణ రీత్యా రుజువు పరచిన వ్యక్తి వి.ఎ. సుహోమ్లీన్ స్కీ. పెంపకాన్నీ, బోధననీ ఒకే విద్యాక్రమంలో మిళితం చెయ్యాలని చాలా కాలంగా అభ్యుదయ అధ్యాపకులు కన్న కలలను తన కృషి ద్వారా సాకారం చేసిన వ్యక్తి సుహోమ్లీన్ స్కీ తన జీవితమంతా విద్యాబోధనకే అంకితం చేశాడు. సమాజం కేంద్రంగానే పిల్లల్ని పెంచాలన్న మకరెంకో సమష్ఠ బోధనాసిద్ధాంతాన్నిఆచరణలో సాధించారు. ఉన్నత నైతిక విలువలూ, పౌరధర్మం ఆధారంగా ఉండే విద్యావిధానం రూపొందాలని ఆశించాడు. పిల్లలకు బోధించాలనుకున్న అధ్యాపకుడికి సహజంగా పిల్లలంటే ఇష్టపడే తత్వం. పిల్లవాడి హృదయాన్ని అన్వేషించే లక్షణం ఉండాలంటాడు. పిల్లలు తమ కుటుంబాన్నీ, పాఠశాలనీ, పనినీ, జ్ఞానాన్నీ, మాతృదేశాన్నీ ప్రేమించేలా ఉపాధ్యాయుడు బోధించగలడన్నది సుహోమ్లీన్ స్కీ నమ్మకం. పవ్లీష్ లోని విద్యాలయం అధిపతిగా ఇతడు తన అభిప్రాయాలను సాధించి చూపాడు. అనేక గ్రంథాలు రాశాడు. వాటిల్లో 'పిల్లలకే నా హృదయం అంకితం' అన్న గ్రంథానికి విశేష ప్రాచుర్యం లభించింది. మహా బోధకుని పుష్కలమైన ఆచరణ యోగ్యమైన అనుభవసారం ఈ గ్రంథం. వీరి కృషికి గుర్తింపుగా 'సోషలిస్టు శ్రమవీరుడు', 'ఉత్తమ ఉపాధ్యాయుడు' వంటి అనేకానేక సోలియాట్ ఉన్నత పురస్కారాల౦దాయి. ఉపాధ్యాయులు తన హృదయాన్ని పిల్లలకే అందజేయాలన్న సందేశం మనకందించారు.© 2017,www.logili.com All Rights Reserved.