"రచయిత ప్రతివారూ తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకి ఉపకారం చేస్తోందో ఆలోచించవలసిన అవసరం వుందని నేను తలుస్తాను. మంచికి హాని, చెడ్డకి సహాయపూఁ చెయ్య కూడదని నేను భావిస్తాను" అనే స్పష్టమైన దృక్పథంతో రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని ప్రజా పంథాలో పయనింపజేసిన రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి.
నాగరికత ముసుగులో దాక్కున్న అమానవీయ ప్రపంచాన్నీ, బాధలకు గురవుతున్న మానవుల కష్టాలనూ విస్పష్టంగా చూసే చూపు రావిశాస్త్రిది. బాల్యంలో అయన చదువుకున్న చార్లెస్ డికెన్సు నవలలు, ఆంటోన్ చెకోవ్ కథలూ రవిశాస్త్రి దృష్టిని అధోజగత్తుకేసి మళ్లించాయి. గురుజాడ నుంచి శ్రీ శ్రీ వరకూ వున్న సాహిత్య నేపథ్యం ఆయనకుంది.
- మధురాంతకం నరేంద్ర