ఈ అభ్యాసన పుస్తకంలో మీరు అనుకున్న చోట, మీకు తెలిసిన అనేక విలువైన పదాలు, మాటలు, వాక్యాలు, ఉండకపోవచ్చు. అరెరె ఇక్కడ ఇది ఉంటే బాగుండు! అది అక్కడ లేకుంటే బావుండు! ఇలా మీ అనుభవాలు ఎన్నో మిమ్మల్ని ఈ పుస్తకం చూసి నొచ్చుకునేలా, కొన్ని సార్లు మెచ్చుకునేలా అనిపించవచ్చు. మీ నొచ్చుకోలు.. మీ మెచ్చుకోలు.. మాకు తప్పక చెప్పగలరని మా వేడుకోలు.
మనకు ప్రాణం పోసేది అమ్మ, అట్టనే పదాలకు, మాటలకు, పాటలకు అమ్మవలె, ఆయువుపోసేవి అక్షరాలు. అక్షరాలు, వాటి ఆకారాలు, వాటి ఉచ్చరణ, గుణింతాలు, వాటి గుర్తులు, స్పష్టంగా తెలుసుకోకుండా ముందుకెళ్ళడం ఎలాంటిదంటే పునాది లేకుండా ఇల్లు కట్టడం వంటిది. మీ పునాది పటిష్టంగా ఉండేందుకు ఈ పుస్తకంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవటం జరిగింది. తెలుగు రెండు రాష్ట్రాలు సంపూర్ణ అక్షరాస్యత సాధించాలనీ ఆకాంక్షిస్తూ తెలుగు లోగిళ్ళలో, తెలుగు తల్లి పొత్తిళ్ళలో ఈ అక్షరాభ్యాసం అలరారుతుందనీ ఆశీస్తూ అందిస్తున్నాం. ఇక పోదాం పదండి ఆటల.. పాటల.. పాఠాల.. అభ్యాసాల.. సాధనకు.. ఆడుతూ.. పాడుతూ.. ఆనందంగా అలకటి తెలుగు అక్షరం వెలుగు.. అక్షరాలయంలోకి.
- అక్షరం ప్రభాకర్
ఈ అభ్యాసన పుస్తకంలో మీరు అనుకున్న చోట, మీకు తెలిసిన అనేక విలువైన పదాలు, మాటలు, వాక్యాలు, ఉండకపోవచ్చు. అరెరె ఇక్కడ ఇది ఉంటే బాగుండు! అది అక్కడ లేకుంటే బావుండు! ఇలా మీ అనుభవాలు ఎన్నో మిమ్మల్ని ఈ పుస్తకం చూసి నొచ్చుకునేలా, కొన్ని సార్లు మెచ్చుకునేలా అనిపించవచ్చు. మీ నొచ్చుకోలు.. మీ మెచ్చుకోలు.. మాకు తప్పక చెప్పగలరని మా వేడుకోలు. మనకు ప్రాణం పోసేది అమ్మ, అట్టనే పదాలకు, మాటలకు, పాటలకు అమ్మవలె, ఆయువుపోసేవి అక్షరాలు. అక్షరాలు, వాటి ఆకారాలు, వాటి ఉచ్చరణ, గుణింతాలు, వాటి గుర్తులు, స్పష్టంగా తెలుసుకోకుండా ముందుకెళ్ళడం ఎలాంటిదంటే పునాది లేకుండా ఇల్లు కట్టడం వంటిది. మీ పునాది పటిష్టంగా ఉండేందుకు ఈ పుస్తకంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవటం జరిగింది. తెలుగు రెండు రాష్ట్రాలు సంపూర్ణ అక్షరాస్యత సాధించాలనీ ఆకాంక్షిస్తూ తెలుగు లోగిళ్ళలో, తెలుగు తల్లి పొత్తిళ్ళలో ఈ అక్షరాభ్యాసం అలరారుతుందనీ ఆశీస్తూ అందిస్తున్నాం. ఇక పోదాం పదండి ఆటల.. పాటల.. పాఠాల.. అభ్యాసాల.. సాధనకు.. ఆడుతూ.. పాడుతూ.. ఆనందంగా అలకటి తెలుగు అక్షరం వెలుగు.. అక్షరాలయంలోకి. - అక్షరం ప్రభాకర్© 2017,www.logili.com All Rights Reserved.