"నేను మూడు తరాల ముసలివాణ్ణి
కవిత్వం అంపశయ్యపై పరున్న భీష్మున్ని"
అని తన మన:స్థితిని ఆయన వెల్లడించాడు. ఈ పుస్తకం ప్రత్యేకత ఏమిటంటే పాఠకుడు ఎక్కడైనా తెరిచి ఏ నాలుగు పంక్తులు చదివైనా ఆనందించవచ్చు. ఉదా:
1. గువ్వగా చెలి ఇంటికి ఎగిసిపోయి
గుండెలోని గుసగుసలను వింటినేను.
2. జవరాలి జడలకుచ్చులలో మల్లెలను
వెదకబోయి జడధారిగా మారిపోతి.
3. ప్రణయ నౌక చెలి చూపుతోనే నడుచు
ప్రణయ భాష రాకున్న కాలమెట్లు గడుచు?
4. గుండె గాయమాయే పడతి నవ్వులతో!
మరింత గాయమాయే పడతి నవ్వులతో!
5. ఆత్మహత్యకు బూని యేదలో బాకును గుచ్చబోతి
నా విషాదగాథ విని కత్తి కూడా మెత్తబడిపోయె.
6. వెన్నెలకు చెలి వొళ్ళు తడిసిపోకుండా
నిత్యము అమావాస్యను కోరుకుంటాను.
సుగంధం ఎవరికిష్టం కాదు? ఒకటి కాదు భరిణ నిండా నింపి మన చేతికిచ్చారు. లోకంలో ప్రేమ ఎంత పాతదో ప్రేమ కవిత్వం కూడా, కనిపించడానికి పాతదిగా కనిపిస్తుంది కాని, ఏ మనిషికామనిషికి యోవ్వన కాలంలో ఎప్పుడు కొత్తది.
-ఇంద్రగంటి శ్రీకాంతశర్మ.
"నేను మూడు తరాల ముసలివాణ్ణి కవిత్వం అంపశయ్యపై పరున్న భీష్మున్ని" అని తన మన:స్థితిని ఆయన వెల్లడించాడు. ఈ పుస్తకం ప్రత్యేకత ఏమిటంటే పాఠకుడు ఎక్కడైనా తెరిచి ఏ నాలుగు పంక్తులు చదివైనా ఆనందించవచ్చు. ఉదా: 1. గువ్వగా చెలి ఇంటికి ఎగిసిపోయి గుండెలోని గుసగుసలను వింటినేను. 2. జవరాలి జడలకుచ్చులలో మల్లెలను వెదకబోయి జడధారిగా మారిపోతి. 3. ప్రణయ నౌక చెలి చూపుతోనే నడుచు ప్రణయ భాష రాకున్న కాలమెట్లు గడుచు? 4. గుండె గాయమాయే పడతి నవ్వులతో! మరింత గాయమాయే పడతి నవ్వులతో! 5. ఆత్మహత్యకు బూని యేదలో బాకును గుచ్చబోతి నా విషాదగాథ విని కత్తి కూడా మెత్తబడిపోయె. 6. వెన్నెలకు చెలి వొళ్ళు తడిసిపోకుండా నిత్యము అమావాస్యను కోరుకుంటాను. సుగంధం ఎవరికిష్టం కాదు? ఒకటి కాదు భరిణ నిండా నింపి మన చేతికిచ్చారు. లోకంలో ప్రేమ ఎంత పాతదో ప్రేమ కవిత్వం కూడా, కనిపించడానికి పాతదిగా కనిపిస్తుంది కాని, ఏ మనిషికామనిషికి యోవ్వన కాలంలో ఎప్పుడు కొత్తది. -ఇంద్రగంటి శ్రీకాంతశర్మ.
© 2017,www.logili.com All Rights Reserved.