వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
కనికల్ల నిజము తెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ !
1
భావము : ఓ మంచి బుద్ధిగల వాడా! ఎవరు చెప్పినా వినాలి. కానీ విన్న వెంటనే తొందరపడి నిర్ణయానికి రాకూడదు. ఆ విషయాన్ని గూర్చి ఆలోచించాలి. ఆ విధంగా అది నిజమో అబద్ధమో తెలుసుకోవాలి. అట్లు తెలుసుకొన్న వాడే నీతిపరుడు.
ఈ పద్యం బద్దెన భూపాలుడు రచించిన 'సుమతి శతకం' లోనిది.
ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వినడమన్నది ఎప్పుడో పోయింది. "వాడు చెప్పేదేమిటి? నేను వినేదేమిటి?” అన్న అహంకారం ఇప్పుడందరిలో ప్రబలిపోయింది. ఎవరికీ ప్రక్కవాళ్ళు చెప్పేది ఎంతటి విషయమైనా శ్రద్దగా వినే తీరిక, ఓపిక రెండూ లేవు. వాళ్ళదారిన వారు చెప్పుకుపోతుంటే మన దారిన మనం ఏదో ఆలోచిస్తుంటాం. "కాలక్షేపం బాతాఖానీలు, ఐడిల్ గాసిప్లు" అయితే మనసు పెట్టి వినకపోయినా పర్వాలేదు. కాని, ఇతరత్రా ఏ మంచి విషయమైనా శ్రద్ధగా వినాలి.
"శ్రద్ధావాన్ లభతే జ్ఞానం" అంటాడు గీతలో శ్రీకృష్ణుడు.
నవవిధ భక్తి మార్గాలలో 'శ్రవణానికే' ప్రథమస్థానం కల్పించారు. శ్రవణం సరిగా వుంటేనే మిగిలినవన్నీ తేలిగ్గా సిద్ధిస్తాయి. శ్రవణం అంటే వినడం. ఆ వినడమేదో శ్రద్ధగా వినాలి. 'కమ్యునికేషన్ స్కిల్స్' వుంటేనే జీవితంలో 'పైకొస్తారని పెద్దలు చెపుతుంటారు. కమ్యునికేషన్ అంటే రాయడం, చదవడం, సంభాషించడమే కాదు, వినడం కూడా! 'శ్రద్ధయా శ్రవణం కుర్యాత్' శ్రద్ధతో వినాలని శాస్త్రం చెపుతుంది. శ్రవణమే జ్ఞానానికి తొలిమెట్టు, అది లేకుంటే జ్ఞానమే ఉదయించదు. విషయాన్ని కూలంకషంగా తెలిసికోవాలంటే ఓపిగ్గా వినాలి. ప్రహ్లాదుడి కథ మనందరికి తెలుసు. శ్రద్ధగా వినడం వల్లనే (తల్లి గర్భమున ఉన్నప్పుడే నారదుడి ద్వారా విష్ణుకథలు విన్నాడు). భక్తులలో అగ్రగణ్యుడయ్యాడు. అష్టావక్రుడు తల్లి కడుపులో వున్నప్పుడే తాతగారు చదివే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు శ్రద్ధగా విన్నాడు కాబట్టే సుబుద్ధి, సూక్ష్మగ్రాహి అయ్యాడు. మహాభారతంలో అభిమన్యు కుమారుడు తల్లి (సుభద్ర) గర్భమందున్నప్పుడే పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో తండ్రి (అర్జునుడు) చెపుతుంటే శ్రద్ధగా విన్నాడు కాబట్టే ద్రోణుడు యుద్ధరంగంలో పన్నిన పద్మవ్యూహాన్ని ఛేదించ.......................
వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనె వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ ! 1 భావము : ఓ మంచి బుద్ధిగల వాడా! ఎవరు చెప్పినా వినాలి. కానీ విన్న వెంటనే తొందరపడి నిర్ణయానికి రాకూడదు. ఆ విషయాన్ని గూర్చి ఆలోచించాలి. ఆ విధంగా అది నిజమో అబద్ధమో తెలుసుకోవాలి. అట్లు తెలుసుకొన్న వాడే నీతిపరుడు. ఈ పద్యం బద్దెన భూపాలుడు రచించిన 'సుమతి శతకం' లోనిది. ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వినడమన్నది ఎప్పుడో పోయింది. "వాడు చెప్పేదేమిటి? నేను వినేదేమిటి?” అన్న అహంకారం ఇప్పుడందరిలో ప్రబలిపోయింది. ఎవరికీ ప్రక్కవాళ్ళు చెప్పేది ఎంతటి విషయమైనా శ్రద్దగా వినే తీరిక, ఓపిక రెండూ లేవు. వాళ్ళదారిన వారు చెప్పుకుపోతుంటే మన దారిన మనం ఏదో ఆలోచిస్తుంటాం. "కాలక్షేపం బాతాఖానీలు, ఐడిల్ గాసిప్లు" అయితే మనసు పెట్టి వినకపోయినా పర్వాలేదు. కాని, ఇతరత్రా ఏ మంచి విషయమైనా శ్రద్ధగా వినాలి. "శ్రద్ధావాన్ లభతే జ్ఞానం" అంటాడు గీతలో శ్రీకృష్ణుడు. నవవిధ భక్తి మార్గాలలో 'శ్రవణానికే' ప్రథమస్థానం కల్పించారు. శ్రవణం సరిగా వుంటేనే మిగిలినవన్నీ తేలిగ్గా సిద్ధిస్తాయి. శ్రవణం అంటే వినడం. ఆ వినడమేదో శ్రద్ధగా వినాలి. 'కమ్యునికేషన్ స్కిల్స్' వుంటేనే జీవితంలో 'పైకొస్తారని పెద్దలు చెపుతుంటారు. కమ్యునికేషన్ అంటే రాయడం, చదవడం, సంభాషించడమే కాదు, వినడం కూడా! 'శ్రద్ధయా శ్రవణం కుర్యాత్' శ్రద్ధతో వినాలని శాస్త్రం చెపుతుంది. శ్రవణమే జ్ఞానానికి తొలిమెట్టు, అది లేకుంటే జ్ఞానమే ఉదయించదు. విషయాన్ని కూలంకషంగా తెలిసికోవాలంటే ఓపిగ్గా వినాలి. ప్రహ్లాదుడి కథ మనందరికి తెలుసు. శ్రద్ధగా వినడం వల్లనే (తల్లి గర్భమున ఉన్నప్పుడే నారదుడి ద్వారా విష్ణుకథలు విన్నాడు). భక్తులలో అగ్రగణ్యుడయ్యాడు. అష్టావక్రుడు తల్లి కడుపులో వున్నప్పుడే తాతగారు చదివే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు శ్రద్ధగా విన్నాడు కాబట్టే సుబుద్ధి, సూక్ష్మగ్రాహి అయ్యాడు. మహాభారతంలో అభిమన్యు కుమారుడు తల్లి (సుభద్ర) గర్భమందున్నప్పుడే పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో తండ్రి (అర్జునుడు) చెపుతుంటే శ్రద్ధగా విన్నాడు కాబట్టే ద్రోణుడు యుద్ధరంగంలో పన్నిన పద్మవ్యూహాన్ని ఛేదించ.......................© 2017,www.logili.com All Rights Reserved.