గణాధిపా!
అధిక ప్రసంగము అవినీతి చర్యలు
అధికమయ్యెను జూడు మవని యందు;
నార్షధర్మము పట్ల నవహేళనము జేయు
నల్పబుద్ధుల జూడ నధికమైరి !
మంచి మాటను చెప్ప మర్యాద గాదను
కొంచెపు బుద్దులు మించిరిలను;
ధర్మపథమనిన దప్పుగా దలచెడి
కుమతులు సంఘముల్ గులుకుచుండె !
తే.గీ. విఘ్ననాయక! వారికి విఘ్నములను
కలుగజేయుచు మాపైన కరుణ జూపి
సవ్య జీవన మికనైన సాగనిమ్ము !
బుధులు రక్షించి యొసగుమా పుణ్యఫలము !
సీ. తిరుమల శిఖరాల తిష్ఠవేసిన స్వామి
పలుమార్లు పిలిచిన పలుకవేమి?
ఆనంద నిలయమ్ము నధివసించిన స్వామి
దీనుల యార్తిని గాన వేమి?
అలమేలు మంగతో కులుకు చుండెడి స్వామి
విన్నపమ్ముల జేయవినవదేమి?
తల వెండ్రుకలనన్ని తొలగజేసెడు స్వామి.
తలవ్రాత మార్చగ దలపవేమి?
వడ్డికాసుల పేర దుడ్డు గోరెడు స్వామి
భక్తుల వేదనల్ బాపవేమి?
తే.గీ. అంతయెత్తున గూర్చుండి ఆర్తజనులు
కష్టనష్టాల గాంచగ నిష్టమేల?
శిష్టజనులను గావంగ కష్టమేమి?
వేంకటేశ్వర! తీర్చరా సంకటములు !................
కోడూరి శేషఫణి శర్మ
శర్మ గారి సీసపద్యాలు
గణాధిపా! అధిక ప్రసంగము అవినీతి చర్యలు అధికమయ్యెను జూడు మవని యందు; నార్షధర్మము పట్ల నవహేళనము జేయు నల్పబుద్ధుల జూడ నధికమైరి ! మంచి మాటను చెప్ప మర్యాద గాదను కొంచెపు బుద్దులు మించిరిలను; ధర్మపథమనిన దప్పుగా దలచెడి కుమతులు సంఘముల్ గులుకుచుండె ! తే.గీ. విఘ్ననాయక! వారికి విఘ్నములను కలుగజేయుచు మాపైన కరుణ జూపి సవ్య జీవన మికనైన సాగనిమ్ము ! బుధులు రక్షించి యొసగుమా పుణ్యఫలము ! వేంకటేశ్వరా! సీ. తిరుమల శిఖరాల తిష్ఠవేసిన స్వామి పలుమార్లు పిలిచిన పలుకవేమి? ఆనంద నిలయమ్ము నధివసించిన స్వామి దీనుల యార్తిని గాన వేమి? అలమేలు మంగతో కులుకు చుండెడి స్వామి విన్నపమ్ముల జేయవినవదేమి? తల వెండ్రుకలనన్ని తొలగజేసెడు స్వామి. తలవ్రాత మార్చగ దలపవేమి? వడ్డికాసుల పేర దుడ్డు గోరెడు స్వామి భక్తుల వేదనల్ బాపవేమి? తే.గీ. అంతయెత్తున గూర్చుండి ఆర్తజనులు కష్టనష్టాల గాంచగ నిష్టమేల? శిష్టజనులను గావంగ కష్టమేమి? వేంకటేశ్వర! తీర్చరా సంకటములు !................ కోడూరి శేషఫణి శర్మ శర్మ గారి సీసపద్యాలు© 2017,www.logili.com All Rights Reserved.