Title | Price | |
Manucharitra | Rs.250 | In Stock |
పెద్దన కవిత్వం జిగిబిగా వున్నా శైలి మృదువైనది. అందుకే వినసొంపుగా మధురంగా వుంటుంది. దీనికితోడూ మనుచరిత్ర శృంగార రస ప్రధానమైనది గాన, అక్కడక్కడా సంస్కృతాంధ్ర పదాలతో, కొన్నిచోట్ల కేవలం తెలుగు పదాలతోనే పద్యాలుండడం వలన అక్కడక్కడా వున్నా ఈయన పదవాక్య జాతిలత్వాన్ని బట్టి అల్లిక జిగిబిగి అనే నానుడి వచ్చి వుంటుంది. రాయలకత్యంత అభిమానపాత్రుడు, నిరంకుశుడైన పెద్దన నడివయస్సులో తను పుట్టి పెరిగిన స్మార్తాన్ని ఒదిలి వైష్ణవాభిమానియైనాడు, రాజుప్రీతికోసం - రాజగురువు తాతాచార్యులకోసం.
రాయలు మనుచరిత్ర అంకితం తీసుకున్నప్పుడు పెద్దన ఎక్కిన పల్లకిని తన చేతితో పట్టి పైకి ఎత్తాడు. అంతేగాక 'కోకట' గ్రామాన్ని తరతరాలుగా అనుభవించమని పెద్దనకివ్వగా, ఆయన వైష్ణవులకోసం తన గురువు శఠగోపయతి జ్ఞాపకార్థం శఠగోపపురమని పేరు మార్చి వైష్ణవమయం చేశాడు. పెద్దన గొప్ప కవీంద్రుడేగాక రాజకీయ చతురుడు కూడా. రాయలు మరణించాక కటకము నుండి గజపతి విజయనగరం మీదికి దండెత్తి వచ్చినప్పుడు ఒకే ఒక పద్యముతో వారిని వెనుకకు పంప్పిన ఘనత కూడా పెద్దనదే!. ఈ మనుచరిత్ర కావ్యానికి విపులమైన పీఠిక వ్రాసి సకాలములో మాకందించిన ప్రసిద్ధులు - పండితులైన డా తూములూరి శ్రీదక్షిణామూర్తి శాస్త్రి గారికి కృతజ్ఞత.
- కప్పగంతుల మురళీకృష్ణ
పెద్దన కవిత్వం జిగిబిగా వున్నా శైలి మృదువైనది. అందుకే వినసొంపుగా మధురంగా వుంటుంది. దీనికితోడూ మనుచరిత్ర శృంగార రస ప్రధానమైనది గాన, అక్కడక్కడా సంస్కృతాంధ్ర పదాలతో, కొన్నిచోట్ల కేవలం తెలుగు పదాలతోనే పద్యాలుండడం వలన అక్కడక్కడా వున్నా ఈయన పదవాక్య జాతిలత్వాన్ని బట్టి అల్లిక జిగిబిగి అనే నానుడి వచ్చి వుంటుంది. రాయలకత్యంత అభిమానపాత్రుడు, నిరంకుశుడైన పెద్దన నడివయస్సులో తను పుట్టి పెరిగిన స్మార్తాన్ని ఒదిలి వైష్ణవాభిమానియైనాడు, రాజుప్రీతికోసం - రాజగురువు తాతాచార్యులకోసం. రాయలు మనుచరిత్ర అంకితం తీసుకున్నప్పుడు పెద్దన ఎక్కిన పల్లకిని తన చేతితో పట్టి పైకి ఎత్తాడు. అంతేగాక 'కోకట' గ్రామాన్ని తరతరాలుగా అనుభవించమని పెద్దనకివ్వగా, ఆయన వైష్ణవులకోసం తన గురువు శఠగోపయతి జ్ఞాపకార్థం శఠగోపపురమని పేరు మార్చి వైష్ణవమయం చేశాడు. పెద్దన గొప్ప కవీంద్రుడేగాక రాజకీయ చతురుడు కూడా. రాయలు మరణించాక కటకము నుండి గజపతి విజయనగరం మీదికి దండెత్తి వచ్చినప్పుడు ఒకే ఒక పద్యముతో వారిని వెనుకకు పంప్పిన ఘనత కూడా పెద్దనదే!. ఈ మనుచరిత్ర కావ్యానికి విపులమైన పీఠిక వ్రాసి సకాలములో మాకందించిన ప్రసిద్ధులు - పండితులైన డా తూములూరి శ్రీదక్షిణామూర్తి శాస్త్రి గారికి కృతజ్ఞత. - కప్పగంతుల మురళీకృష్ణ© 2017,www.logili.com All Rights Reserved.