సాహిత్యం ఆలోచనామృతము. లోచనాలకు ఆవలనున్నది ఆలోచానము. ఆ విషయమై మన ఊహా పటిమను ఎంత దూరమైనా సాగించవచ్చును. ఒకప్పుడు జీవనమైనా విసుగు పుట్టించవచ్చును, కాని సాహిత్యం అలా కాదు. అది ఎప్పటికి నిత్యనూతనంగానే భాసిస్తుంది. దానికి ప్రధాన కారణం, చదివిన ప్రతిసారి కొత్త కొత్త ఊహలు పాఠకుని మనసులో కదలాడటం. కాగా పింగళి వెంకట కృష్ణారావు గారి ఈ రచన అలాంటి ఎన్నో ఊహలను మనకు అందిస్తుంది. దానికి మన ఆలోచన తోడైతే, అది అమృతపుధార, దానిని ఒడిసి పట్టుకొనటమే చదువరి పని.
మన వాజ్మయంలో ప్రబంధాల దొక విశిష్టమైన విధానం. పాఠకులకు రసస్పూర్తిని ఇస్తూనే హితబోధ గావిస్తాయి. అటువంటి వాటిలో పెద్దనామత్యుని మనుచరిత్ర పేరెన్నిక గన్నది. ప్రథమమైనది. తెలుగు సాహిత్యంలో ఏపాటి పరిచయమున్న వారికైనా మనుచరిత్ర పరిచయమే. అయితే చాలామంది ద్వితీయాశ్వాసం వరకే పరిమితమవుతారు. కాని పెద్దన రచనోద్దేశం చివరివరకు చదివితేనే తెలుస్తుంది.
సాహిత్యం ఆలోచనామృతము. లోచనాలకు ఆవలనున్నది ఆలోచానము. ఆ విషయమై మన ఊహా పటిమను ఎంత దూరమైనా సాగించవచ్చును. ఒకప్పుడు జీవనమైనా విసుగు పుట్టించవచ్చును, కాని సాహిత్యం అలా కాదు. అది ఎప్పటికి నిత్యనూతనంగానే భాసిస్తుంది. దానికి ప్రధాన కారణం, చదివిన ప్రతిసారి కొత్త కొత్త ఊహలు పాఠకుని మనసులో కదలాడటం. కాగా పింగళి వెంకట కృష్ణారావు గారి ఈ రచన అలాంటి ఎన్నో ఊహలను మనకు అందిస్తుంది. దానికి మన ఆలోచన తోడైతే, అది అమృతపుధార, దానిని ఒడిసి పట్టుకొనటమే చదువరి పని. మన వాజ్మయంలో ప్రబంధాల దొక విశిష్టమైన విధానం. పాఠకులకు రసస్పూర్తిని ఇస్తూనే హితబోధ గావిస్తాయి. అటువంటి వాటిలో పెద్దనామత్యుని మనుచరిత్ర పేరెన్నిక గన్నది. ప్రథమమైనది. తెలుగు సాహిత్యంలో ఏపాటి పరిచయమున్న వారికైనా మనుచరిత్ర పరిచయమే. అయితే చాలామంది ద్వితీయాశ్వాసం వరకే పరిమితమవుతారు. కాని పెద్దన రచనోద్దేశం చివరివరకు చదివితేనే తెలుస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.