Title | Price | |
Manucharitra | Rs.150 | In Stock |
శ్రీ వక్షోజ కురంగనాభ మెదపైఁ జెన్నొంద విశ్వంభరా
దేవిం దత్కమలా సమీపమునఁ బ్రీతి న్ని ల్పినాఁడో యనం
గా వందారు సనందనాది నిజభక్త శ్రేణికిం దోఁచు రా
జీవాక్షుండు గృతార్థుఁ జేయు శుభదృష్టిం గృష్ణరాయాధిపున్.
అర్ధాలు: శ్రీవక్షోజ = లక్ష్మీదేవి పాలిండ్లపై నున్న; కురంగనాభము = కస్తూరీ పరిమళద్రవ్యం; ఎదపైన్ = రొమ్ముపై; చెన్ను+ఒందన్ = అందంగా ప్రకాశిస్తుంటే; విశ్వంభరాదేవిన్ భూదేవిని; తత్+కమలా సమీపమునన్ = ఆ లక్ష్మీదేవి చెంత; ప్రీతిన్ = ప్రేమగా; నిలిపినాడో= ఉంచాడో; అనంగాన్ = అనేటట్లు; వందారు = నమస్కరించే; నిజభక్తశ్రేణికిన్ భక్తకోటికి; తోచు = కనిపించే; రాజీవ + అక్షుండు = పద్మాల వంటి నేత్రాలు గల శ్రీమహావిష్ణువు; కృష్ణరాయ+అధిపున్ = శ్రీకృష్ణదేవరాయ చక్రవర్తిని; కృత+ అర్జున్ ఇష్టసిద్ధి కలిగేలాగ; చేయున్ = చేయుఁగాక!
తాత్పర్యం: లక్ష్మీదేవి పాలిండ్లపై నున్న కస్తూరి, ఆమెను కౌగిలించుకున్న శ్రీమహావిష్ణువు వక్షఃస్థలంపై అంటుకొంది. అలా అంటుకున్న కస్తూరి, విష్ణువుకు నమస్కరించే సనకసనందనాది భక్తులకు ఎలా కనిపించిందంటే శ్రీదేవితోపాటు భూదేవిని కూడా, తన వక్షాన శ్రీమహావిష్ణువు నిలుపుకొన్నాడా? అన్నట్లుగా. అటువంటి శ్రీమన్నారాయణుడు, ఈ కావ్యానికి భర్తయైన శ్రీకృష్ణదేవరాయలను శుభదృష్టితో చూచి, ఇష్టసిద్ధిని కలిగించుగాక!..........
శ్రీరస్తు మనుచరిత్ర ప్రథమాశ్వాసము అవతారిక ఇష్టదేవతా వందనము సనకసనందనాదుల భ్రాంతి: శ్రీ వక్షోజ కురంగనాభ మెదపైఁ జెన్నొంద విశ్వంభరా దేవిం దత్కమలా సమీపమునఁ బ్రీతి న్ని ల్పినాఁడో యనం గా వందారు సనందనాది నిజభక్త శ్రేణికిం దోఁచు రా జీవాక్షుండు గృతార్థుఁ జేయు శుభదృష్టిం గృష్ణరాయాధిపున్. అర్ధాలు: శ్రీవక్షోజ = లక్ష్మీదేవి పాలిండ్లపై నున్న; కురంగనాభము = కస్తూరీ పరిమళద్రవ్యం; ఎదపైన్ = రొమ్ముపై; చెన్ను+ఒందన్ = అందంగా ప్రకాశిస్తుంటే; విశ్వంభరాదేవిన్ భూదేవిని; తత్+కమలా సమీపమునన్ = ఆ లక్ష్మీదేవి చెంత; ప్రీతిన్ = ప్రేమగా; నిలిపినాడో= ఉంచాడో; అనంగాన్ = అనేటట్లు; వందారు = నమస్కరించే; నిజభక్తశ్రేణికిన్ భక్తకోటికి; తోచు = కనిపించే; రాజీవ + అక్షుండు = పద్మాల వంటి నేత్రాలు గల శ్రీమహావిష్ణువు; కృష్ణరాయ+అధిపున్ = శ్రీకృష్ణదేవరాయ చక్రవర్తిని; కృత+ అర్జున్ ఇష్టసిద్ధి కలిగేలాగ; చేయున్ = చేయుఁగాక! తాత్పర్యం: లక్ష్మీదేవి పాలిండ్లపై నున్న కస్తూరి, ఆమెను కౌగిలించుకున్న శ్రీమహావిష్ణువు వక్షఃస్థలంపై అంటుకొంది. అలా అంటుకున్న కస్తూరి, విష్ణువుకు నమస్కరించే సనకసనందనాది భక్తులకు ఎలా కనిపించిందంటే శ్రీదేవితోపాటు భూదేవిని కూడా, తన వక్షాన శ్రీమహావిష్ణువు నిలుపుకొన్నాడా? అన్నట్లుగా. అటువంటి శ్రీమన్నారాయణుడు, ఈ కావ్యానికి భర్తయైన శ్రీకృష్ణదేవరాయలను శుభదృష్టితో చూచి, ఇష్టసిద్ధిని కలిగించుగాక!..........© 2017,www.logili.com All Rights Reserved.