మన సంప్రదాయ పంటలు చిరుధాన్యాలు. ఇవి తరగని పోషకాల గనులు. ఆరోగ్య సిరులు. అయితే అభివృద్ధి క్రమంలో మనం వీటికి దూరమయ్యాం. ఆధునిక జీవన శైలి, సరళి తెస్తున్న అనారోగ్య సమస్యలకు 'చెక్' చెప్పటానికి చిరుధాన్యాలు వాడకం తప్పనిసరి అంటున్నారు. చిరుధాన్యాలతో తయారయ్యే ఆహార పదార్థాలు నిన్నమొన్నటిదాకా పేదరికానికి గురుతులు. ఈ రోజు సంప్రదాయ, సంస్కృతి వారసత్వానికి ప్రతిబింబాలుగా ఐదు నక్షత్రాల హోటళ్ళలో అత్యంత ఖరీదైన ఆహారంగా మారటం ఎంత దురదృష్టకరం.
దేశవ్యాప్తంగా 'చిరుధాన్యాల' సాగు కోసం జరుగుతున్న మహోద్యమానికి చంద్రునికో నూలుపోగులా 'రైతునేస్తం' ఈ పుస్తకం తీసుకురావటం ద్వారా తనవంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నట్లు భావిస్తోంది. ఆ మహా యజ్ఞంలో భాగస్వామ్యం అందుకుంటున్నందుకు గర్వంగా ఉంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వాలు చిరుధాన్యాలకు లాభసాటి ధరతోపాటు ప్రజా పంపిణీ వ్యవస్థలో తప్పనిసరిగా భాగస్వామ్యం చేయాలని 'రైతునేస్తం' కోరుకుంటోంది. మా 'రైతునేస్తం' పబ్లికేషన్స్ నుండి వస్తున్న ఈ పుస్తకాన్ని కూడా గతంలో మా పుస్తక ప్రచురణలను ఆదరించినట్లే ఆదరించి మీ ఆశీస్సులు అందిస్తారని కోరుకుంటూ..
- వెంకటేశ్వరరావు
మన సంప్రదాయ పంటలు చిరుధాన్యాలు. ఇవి తరగని పోషకాల గనులు. ఆరోగ్య సిరులు. అయితే అభివృద్ధి క్రమంలో మనం వీటికి దూరమయ్యాం. ఆధునిక జీవన శైలి, సరళి తెస్తున్న అనారోగ్య సమస్యలకు 'చెక్' చెప్పటానికి చిరుధాన్యాలు వాడకం తప్పనిసరి అంటున్నారు. చిరుధాన్యాలతో తయారయ్యే ఆహార పదార్థాలు నిన్నమొన్నటిదాకా పేదరికానికి గురుతులు. ఈ రోజు సంప్రదాయ, సంస్కృతి వారసత్వానికి ప్రతిబింబాలుగా ఐదు నక్షత్రాల హోటళ్ళలో అత్యంత ఖరీదైన ఆహారంగా మారటం ఎంత దురదృష్టకరం. దేశవ్యాప్తంగా 'చిరుధాన్యాల' సాగు కోసం జరుగుతున్న మహోద్యమానికి చంద్రునికో నూలుపోగులా 'రైతునేస్తం' ఈ పుస్తకం తీసుకురావటం ద్వారా తనవంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నట్లు భావిస్తోంది. ఆ మహా యజ్ఞంలో భాగస్వామ్యం అందుకుంటున్నందుకు గర్వంగా ఉంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వాలు చిరుధాన్యాలకు లాభసాటి ధరతోపాటు ప్రజా పంపిణీ వ్యవస్థలో తప్పనిసరిగా భాగస్వామ్యం చేయాలని 'రైతునేస్తం' కోరుకుంటోంది. మా 'రైతునేస్తం' పబ్లికేషన్స్ నుండి వస్తున్న ఈ పుస్తకాన్ని కూడా గతంలో మా పుస్తక ప్రచురణలను ఆదరించినట్లే ఆదరించి మీ ఆశీస్సులు అందిస్తారని కోరుకుంటూ.. - వెంకటేశ్వరరావు© 2017,www.logili.com All Rights Reserved.