సినిమా గేయ సాహిత్యంలో ఆణిముత్యాల లాంటి పాటలతో చిరకాలం నిలిచిపోయే వ్యక్తి కొసరాజు రాఘవయ్య. ఆ పాటలు అందరికి అందుబాటులో ఉండాలని అయన రాసిన అన్ని సినిమా పాటలను సంకలనంగా ప్రచురించాం.
జానపద కవి సార్వభౌమ, కవిరత్న వంటి బిరుదులతోపాటు ఎన్నో సన్మానాలు పొందిన కొసరాజు, సినిమా పాటలు రచయితగా ప్రసిద్ధి పొందినప్పటికీ ఇతర ఎన్నో రచనలు చేశారు. చిన్ననాటనే రాసిన కవితల వల్ల బాలకవి అన్న పేరు పొందారు.
1939 లో రైతుబిడ్డలో పాటలతో మొదలైన సినీరంగం ప్రవేశం పదేళ్లు పైబడిన వ్యవధితో 1954 లో పెద్ద మనుషులతో మళ్లి అందుకుని అప్రతిహతంగా కొనసాగింది. 1986 లో అయన చనిపోయేవరకు సినిమా పాటలు రాస్తూనే ఉన్నారు. అయన పాటలు రాసిన సినిమాలు కొన్ని అయన చనిపోయిన తరువాత విడుదలయ్యాయి.
-కొసరాజు రాఘవయ్య చౌదరి.