కొసరాజు అంటే పెద్ద గ్రంథం కానవసరం లేదు. వాక్యం రసాత్మకం కావ్యం అన్నారు. అద్భుత రసానుభూతి కలిగించే ఒక్క వాక్యమైనా కావ్యమే. నిజానికి ప్రతి కవిత దానికది ఒక కావ్యమే. ఇంకా చెప్పాలంటే మన పూర్వీకులు, ప్రాచీన కాలంలో పద్యానికి, గద్యానికి పెద్ద తేడా చూపించినట్లు కనిపించదు. పద్యకావ్యాలున్నట్లే మనకు గద్య కావ్యాలున్నాయి. పద్యము గద్యము కలిసిన చంపూ కావ్యాలున్నాయి. ప్రతి కావ్యం ఒక నిరంతరాయ కథను, లేదా అనుభూతిని అందించేది. అలాగే ప్రతి కవిత కూడా ఒక రసానుభూతి.
ఈ కవిత్వ సంపుటికి పేరు పెట్టిన ‘అంతర్వాణి’ కవిత వస్తుపరంగా మనిషి అంతరాత్మతో సంభాషణ వంటిది. చతురస్రగతిలో రాసిన గేయాత్మక నడక ఇందులో కనబడుతుంది. ఇది వచన కవితగా చెప్పుకున్నప్పటికీ పాడడానికి వీలుగా ఉన్న మాత్రాగమనంలో రాసిన కవిత. ఈ కవితా సంపుటిలో చాలా కవితల్లో ఇలాంటి లయ, ప్రాస, నడక మనకు కనిపిస్తాయి. ఈ సంపుటిలో ఆకర్షించిన మరో కవిత ‘కిరకుడు’. కృష్ణప్రసాద్ ప్రతి కవిత తర్వాత చిన్న వివరణ, కఠినపదాలకు అర్థాలు ఇవ్వడం వల్ల పాఠకులకు చాలా సౌలభ్యం కలిగించారు. కిరకుడు అంటే రాసేవాడు. ఇది లఘుకవిత. ఈ కవిత కూడా దాదాపు తిశ్రగతిలో కనిపిస్తుంది. ఒక విలేఖరి అంతర్వాణి వినిపించడం గురించిన కవిత ఇది.
అభ్యుదయం, సామాజికప్రయోజనం, సమాజం పట్ల ప్రేమ, ఉన్నత విలువలు, ఉదాత్త ప్రమాణాలను ప్రతిబింబించే కవితలెన్నో ఉన్న కవిత్వ సంపుటి, కృష్ణప్రసాద్ రాసిన ‘అంతర్వాణి’.