శివప్రసాద్ నాటికల్లో లేదా అతని మొత్తం రచనల్లో ఉపన్యాసాలు, ఉపదేశాలు, అనవసర చర్చలు, సాగదీతలూ ఉండవు. అవసరమైన చోట రాజ్యాన్ని వ్యతిరేకిస్తాడు. నిత్య జీవితంలో మనకు కలిగే గాయాలను చూపెడతాడు. ఎక్కడా పరిష్కారాలు చెప్పడు, సూచించడు. శివప్రసాద్ ది సవిమర్శక వాస్తవికతా ధోరణి. ప్రజా సాంస్కృతికొద్యమాన్ని బలపరచడమే అతని ధ్యేయం. అభ్యుదయ రచయితగా అతను ఎంచుకున్న మార్గం అది.
శివప్రసాద్ రచనలు సమాజం నుండి, జీవితం నుండి కళాత్మకంగా రూపొందినవి. రచనను సామాజిక బాధ్యతగా స్వీకరించాడు. గురజాడకు వారసుడు. కన్యాశుల్కం ఈనాటికీ ఏనాటికీ చూడటానికేగాక చదవటానికీ గొప్పగా ఉండే నాటకం. ఇప్పుడు వస్తున్న అనేకం చూడటానికేగాక చదవటానికి అనుకూలంగా లేవు. చూడటానికి చదవటానికి పనికొచ్చే లక్షణాలూ, లక్ష్యాలూ ఉండే నాటికలూ, నాటకాలూ అసలైనవనేది నిర్ధారిత సత్యం. శివప్రసాద్ ఈ రెండు విషయాల్లోనూ విజయం సాధించాడు.
- పెనుగొండ లక్ష్మీనారాయణ
శివప్రసాద్ నాటికల్లో లేదా అతని మొత్తం రచనల్లో ఉపన్యాసాలు, ఉపదేశాలు, అనవసర చర్చలు, సాగదీతలూ ఉండవు. అవసరమైన చోట రాజ్యాన్ని వ్యతిరేకిస్తాడు. నిత్య జీవితంలో మనకు కలిగే గాయాలను చూపెడతాడు. ఎక్కడా పరిష్కారాలు చెప్పడు, సూచించడు. శివప్రసాద్ ది సవిమర్శక వాస్తవికతా ధోరణి. ప్రజా సాంస్కృతికొద్యమాన్ని బలపరచడమే అతని ధ్యేయం. అభ్యుదయ రచయితగా అతను ఎంచుకున్న మార్గం అది. శివప్రసాద్ రచనలు సమాజం నుండి, జీవితం నుండి కళాత్మకంగా రూపొందినవి. రచనను సామాజిక బాధ్యతగా స్వీకరించాడు. గురజాడకు వారసుడు. కన్యాశుల్కం ఈనాటికీ ఏనాటికీ చూడటానికేగాక చదవటానికీ గొప్పగా ఉండే నాటకం. ఇప్పుడు వస్తున్న అనేకం చూడటానికేగాక చదవటానికి అనుకూలంగా లేవు. చూడటానికి చదవటానికి పనికొచ్చే లక్షణాలూ, లక్ష్యాలూ ఉండే నాటికలూ, నాటకాలూ అసలైనవనేది నిర్ధారిత సత్యం. శివప్రసాద్ ఈ రెండు విషయాల్లోనూ విజయం సాధించాడు. - పెనుగొండ లక్ష్మీనారాయణ© 2017,www.logili.com All Rights Reserved.