'చిన్నపిల్లలు పది పుస్తకాలు చదివితే రాని విజ్ఞానం ఒక మంచి నాటకం చూస్తే వస్తుంది' అంటారు నండూరి రామకృష్ణమాచార్య. ఈ సంగతి ముఖ్యంగా గ్రహించవలసిన వాళ్ళు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వాహకులు. పెద్దలకు బుద్ధులు చెప్పటానికి పిల్లల నాటికల ద్వారా ప్రయత్నించ కూడదు. పిల్లల అవగాహనను, ఆలోచనా పరిధిని మించకుండా చూడాలి. కేవలం పిల్లలకు నీతి బోధకాలుగానే కాకుండా పిల్లల మనస్సులకు ఆనందం, ఆహ్లాదం కలిగించటంతో పాటు, వారిలోని సృజనాత్మక శక్తికి పదును పెట్టేలా, ఊహలకు రెక్కలు తొడిగేలా, మానసిక వికాసానికి దోహదపడేలా బాలల నాటక సాహిత్యం ఉండాలని అభిలషిస్తున్నాం.
సుమారు వందేళ్ళ కాలంలో జరిగిన సామాజిక పరిణామాలతో పాటు పిల్లల విషయంలో మారుతూ వచ్చిన పెద్దల ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు, ఆలోచనా ధోరణులను సంకలనం ప్రతిబింబించేలా చేయాలన్న మా సంకల్పం ఎంతవరకు నెరవేరిందో విజ్ఞులైన మీరే చెప్పాలి.
'చిన్నపిల్లలు పది పుస్తకాలు చదివితే రాని విజ్ఞానం ఒక మంచి నాటకం చూస్తే వస్తుంది' అంటారు నండూరి రామకృష్ణమాచార్య. ఈ సంగతి ముఖ్యంగా గ్రహించవలసిన వాళ్ళు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వాహకులు. పెద్దలకు బుద్ధులు చెప్పటానికి పిల్లల నాటికల ద్వారా ప్రయత్నించ కూడదు. పిల్లల అవగాహనను, ఆలోచనా పరిధిని మించకుండా చూడాలి. కేవలం పిల్లలకు నీతి బోధకాలుగానే కాకుండా పిల్లల మనస్సులకు ఆనందం, ఆహ్లాదం కలిగించటంతో పాటు, వారిలోని సృజనాత్మక శక్తికి పదును పెట్టేలా, ఊహలకు రెక్కలు తొడిగేలా, మానసిక వికాసానికి దోహదపడేలా బాలల నాటక సాహిత్యం ఉండాలని అభిలషిస్తున్నాం. సుమారు వందేళ్ళ కాలంలో జరిగిన సామాజిక పరిణామాలతో పాటు పిల్లల విషయంలో మారుతూ వచ్చిన పెద్దల ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు, ఆలోచనా ధోరణులను సంకలనం ప్రతిబింబించేలా చేయాలన్న మా సంకల్పం ఎంతవరకు నెరవేరిందో విజ్ఞులైన మీరే చెప్పాలి.© 2017,www.logili.com All Rights Reserved.