శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు జగమెరిగిన రాజకీయ నాయకుడు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 'లా' చదువుతున్న సమయంలోనే ఆయన విద్యార్థి సంఘం అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. విద్యార్థి రాజకీయాల నుంచి ప్రజాక్షేత్రంలో ప్రవేశించిన ఆయన పిన్న వయస్సులో తన 29 న ఏట శాసన సభ్యుడుగా ఎన్నికయ్యారు. బిజెపి ఆవిర్భావం నుంచి ఆయన వివిధ స్థాయిల్లో పార్టీకి సేవలందించారు. రెండు సార్లు ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడుగా, జాతీయ స్థాయిలో పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ జాతీయ అధ్యక్షపదవి చేపట్టెంతవరకూ అంచెలంచెలుగా ఆయన ప్రస్థానం సాగింది. వెంకయ్య నాయుడు చేసిన కీలక ప్రసంగాలు ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు జగమెరిగిన రాజకీయ నాయకుడు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 'లా' చదువుతున్న సమయంలోనే ఆయన విద్యార్థి సంఘం అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. విద్యార్థి రాజకీయాల నుంచి ప్రజాక్షేత్రంలో ప్రవేశించిన ఆయన పిన్న వయస్సులో తన 29 న ఏట శాసన సభ్యుడుగా ఎన్నికయ్యారు. బిజెపి ఆవిర్భావం నుంచి ఆయన వివిధ స్థాయిల్లో పార్టీకి సేవలందించారు. రెండు సార్లు ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడుగా, జాతీయ స్థాయిలో పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ జాతీయ అధ్యక్షపదవి చేపట్టెంతవరకూ అంచెలంచెలుగా ఆయన ప్రస్థానం సాగింది. వెంకయ్య నాయుడు చేసిన కీలక ప్రసంగాలు ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.