పుస్తకాలు కొనడానికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఏవైనా "కొత్త కవితా సంపుటి" లు వచ్చాయేమో అని ఆరాతీస్తూనే ఉంటా.కానీ వాటిని చదివిన తరువాత ఏదో తెలియని నిరాశ.మనస్సుకు దగ్గరగా ఉన్న కవితా సంపుటిలు చదివి చాలా కాలమైంది.అప్పుడెప్పుడో చదివిన తిలక్ "అమృతం కురిసిన రాత్రి" మరియు శ్రీ శ్రీ "మహా ప్రస్తానం" తప్ప, అంత కనెక్ట్ అయ్యే కవితలు చదవలేదు. ఇదిగో అందుకు సమాదానంగా వచ్చినట్టుంది "ఎటువైపుకు పయనం" ఏదైనా కవితాసంపుటి లో చాలా తక్కువ కవితలు మనకు కనెక్ట్ అవుతాయి.కానీ ఈ పుస్తకం అందుకు విరుద్దం.చాలా కవితలు మన గత బానిస జీవితాన్ని ప్రశ్నిస్తాయి. కవిత్వం అంటే ప్రకృతి వర్ణన లేదా మగువ అందాలని పొగడటం లేదా విరహం గురించిన భాద తప్ప వేరే కవితలు అరుదు.కానీ ఈ పుస్తకం అందుకు విరుద్దం. రచయిత చెప్పాలనుకున్న "తత్వం" మనల్ని అనేక ప్రశ్నలకు గురిచేస్తుంది. ముఖ్యంగా "అయాన్ రాండ్".,రంగనాయకమ్మ",స్టీఫెన్ హాకింగ్" రచనల,జీవితాల,సిద్దాంతాల సారాంశాల్ని కవితాత్మకంగా చెప్పడం బావుంది. చివరిగా ఈ పుస్తకాన్ని భాష,వ్యాకరణం కోణాల్లో కాక "భావం" పరంగా చదివితే మంచి అనుభూతి పొందగలరని నా అభిప్రాయం.
© 2017,www.logili.com All Rights Reserved.