శ్రీ బూర్గుల బహుబాషావేత్త. ఆంగ్లం, పార్శీ, ఉర్దూ, సంస్కృతం, మహారాష్ట్రం, కన్నడం, తెలుగు భాషలలో పండితులు. కేరళలో ఉన్న రోజుల్లో మలయాళం కూడా అభ్యసించారు. ఆయా భాషలలో అనర్గళంగా ఉపన్యసించగలిగేవారు. న్యాయవాద వృత్తిలోవున్నా, స్వాతంత్రోద్యమంలో సాహిత్యాభిలాష అనవరతం ద్యోతకమవుతూనే ఉండింది. అధ్యయనం, సాహిత్య సృజనం ఆయనకు నిత్యవ్యాపకాలు. వివిధ సందర్భాలలో వివిధ భాషలలో విరచించిన కవితలు, వ్యాసాలూ, అనువాద రచనలు అందుకు సాక్ష్యాలు.
ఈ సంపుటి ఒక విదగ్ధమైన, విశిష్టమైన ప్రచురణగా నిలిచిపోతుందని నా నమ్మకం. దీనిలో వివిధ భాషలలోని సాహిత్యాల గుబాళింపులు ఉన్నాయి. తాత్త్విక చింతన వుంది. చరిత్ర పరిచయం ఉంది. భాషా సంబంధమైన చర్చవుంది. సాహిత్యాల తులనాత్మక పరిశీలనం కొంత వుంది. ఉత్తమ కవిత్వాన్ని గూర్చిన ప్రస్తావన వుంది. అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోదగింది, ఈ వ్యాసాలూ సాహితీపరులకు విజ్ఞానదాయకంగా, మార్గదర్శకంగా ఉంటాయని ఆశిస్తాను.
- డి రామలింగం
శ్రీ బూర్గుల బహుబాషావేత్త. ఆంగ్లం, పార్శీ, ఉర్దూ, సంస్కృతం, మహారాష్ట్రం, కన్నడం, తెలుగు భాషలలో పండితులు. కేరళలో ఉన్న రోజుల్లో మలయాళం కూడా అభ్యసించారు. ఆయా భాషలలో అనర్గళంగా ఉపన్యసించగలిగేవారు. న్యాయవాద వృత్తిలోవున్నా, స్వాతంత్రోద్యమంలో సాహిత్యాభిలాష అనవరతం ద్యోతకమవుతూనే ఉండింది. అధ్యయనం, సాహిత్య సృజనం ఆయనకు నిత్యవ్యాపకాలు. వివిధ సందర్భాలలో వివిధ భాషలలో విరచించిన కవితలు, వ్యాసాలూ, అనువాద రచనలు అందుకు సాక్ష్యాలు. ఈ సంపుటి ఒక విదగ్ధమైన, విశిష్టమైన ప్రచురణగా నిలిచిపోతుందని నా నమ్మకం. దీనిలో వివిధ భాషలలోని సాహిత్యాల గుబాళింపులు ఉన్నాయి. తాత్త్విక చింతన వుంది. చరిత్ర పరిచయం ఉంది. భాషా సంబంధమైన చర్చవుంది. సాహిత్యాల తులనాత్మక పరిశీలనం కొంత వుంది. ఉత్తమ కవిత్వాన్ని గూర్చిన ప్రస్తావన వుంది. అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోదగింది, ఈ వ్యాసాలూ సాహితీపరులకు విజ్ఞానదాయకంగా, మార్గదర్శకంగా ఉంటాయని ఆశిస్తాను. - డి రామలింగం© 2017,www.logili.com All Rights Reserved.