మానవులు ఉన్నది, 'మానవ సమాజమే' అవుతుంది. అయితే, ఆ సమాజంలో ఉన్న తీరు తెన్నుల్ని చూస్తే, అడుగడుగునా, 'ఇది మానవ సమాజమేనా?' అనే ప్రశ్న రావలసి ఉంటుంది. సమాజంలో ఉన్న మొత్తం సమస్యల్లో, తక్షణం మొట్టమొదట పరిష్కారం కావలసిన కౄర సమస్య ఒకటి ఉంది. మానవుల మనస్సుల్నీ, మేధస్సుల్నీ, అతి కౄరత్వంలోకి ఈడ్చిన ఈ సమస్య, అట్టడుగు కులపు హిందూ స్త్రీ పురుషుల్నీ, అతి బీద స్థితిలో ఉన్న ముస్లిం స్త్రీ పురుషుల్నీ, కొన్ని తెగల ఆదివాసీ స్త్రీ పురుషుల్నీ, యజమానుల ఇళ్ళల్లో ఉండే పాయిఖానా దొడ్లలోని మలమూత్రాల్నీ తమ స్వంత చేతులతో ఎత్తివేస్తూ శుభ్రాలు చేసే 'పాకీ చాకిరీ'కి కట్టిపడేస్తుంది!
'పాకీ చాకిరీ' అనే దాన్ని, రోడ్లని ఊడ్చే పని లాగానో, చచ్చిన జంతువుల్ని పాతిపెట్టే పని లాగానో, జమ కడితే, పాకీ పనిలో ఉండే బాధల్నీ, అవమానాల్నీ, దుఃఖాల్నీ, అర్ధం చేసుకునేదేమీ ఉండదు. ధనిక మానవుల ఇళ్ళల్లో కుక్కులూ పిల్లులూ ఉంటే, వాటి మల మూత్రాల్ని ఎత్తడం కూడా ఆ ఇంటి సేవకులైన బీద మానవుల పనే కదా?
మానవులు నివసించే సమాజాన్ని గురించి, 'ఇది, మానవ సమాజమేనా?' అని ప్రశ్నించుకోవచ్చునా? అటువంటి ప్రశ్న ఎందుకు వచ్చిందో ఈ పుస్తకం చదివి తెలుసుకోండి..
- రంగనాయకమ్మ
మానవులు ఉన్నది, 'మానవ సమాజమే' అవుతుంది. అయితే, ఆ సమాజంలో ఉన్న తీరు తెన్నుల్ని చూస్తే, అడుగడుగునా, 'ఇది మానవ సమాజమేనా?' అనే ప్రశ్న రావలసి ఉంటుంది. సమాజంలో ఉన్న మొత్తం సమస్యల్లో, తక్షణం మొట్టమొదట పరిష్కారం కావలసిన కౄర సమస్య ఒకటి ఉంది. మానవుల మనస్సుల్నీ, మేధస్సుల్నీ, అతి కౄరత్వంలోకి ఈడ్చిన ఈ సమస్య, అట్టడుగు కులపు హిందూ స్త్రీ పురుషుల్నీ, అతి బీద స్థితిలో ఉన్న ముస్లిం స్త్రీ పురుషుల్నీ, కొన్ని తెగల ఆదివాసీ స్త్రీ పురుషుల్నీ, యజమానుల ఇళ్ళల్లో ఉండే పాయిఖానా దొడ్లలోని మలమూత్రాల్నీ తమ స్వంత చేతులతో ఎత్తివేస్తూ శుభ్రాలు చేసే 'పాకీ చాకిరీ'కి కట్టిపడేస్తుంది! 'పాకీ చాకిరీ' అనే దాన్ని, రోడ్లని ఊడ్చే పని లాగానో, చచ్చిన జంతువుల్ని పాతిపెట్టే పని లాగానో, జమ కడితే, పాకీ పనిలో ఉండే బాధల్నీ, అవమానాల్నీ, దుఃఖాల్నీ, అర్ధం చేసుకునేదేమీ ఉండదు. ధనిక మానవుల ఇళ్ళల్లో కుక్కులూ పిల్లులూ ఉంటే, వాటి మల మూత్రాల్ని ఎత్తడం కూడా ఆ ఇంటి సేవకులైన బీద మానవుల పనే కదా? మానవులు నివసించే సమాజాన్ని గురించి, 'ఇది, మానవ సమాజమేనా?' అని ప్రశ్నించుకోవచ్చునా? అటువంటి ప్రశ్న ఎందుకు వచ్చిందో ఈ పుస్తకం చదివి తెలుసుకోండి.. - రంగనాయకమ్మ
© 2017,www.logili.com All Rights Reserved.