మానవ జాతిలో అగ్రశ్రేణికి చెందిన భావుకులు ఇదివరకే లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వడంలోనే మార్క్స్ ప్రతిభ వుంది. తత్వశాస్త్రంలోనూ, అర్థశాస్త్రంలోనూ, సోషలిజంలోనూ మహాపండితులైన వారి బోధలకు సూటి అయిన తక్షణమైన కొనసాగింపుగానే మార్క్స్ సిద్ధాంతం వుద్భవించింది.
మార్క్సిస్టు సిద్ధాంతం సర్వశక్తివంతమైనది, ఎందుకంటే అది సత్యమైనది. అది సమగ్రమైనది, సమరసమైనది, ఏ రకమైన మూఢ నమ్మకంతోగానీ, అభివృద్ధి నిరోధకత్వంతోగానీ, బూర్జువా పీడనను సమర్థించడంతోగానీ రాజీపడని పరిపూర్ణమైన ప్రపంచ దృక్పథాన్ని మానవులకు సమకూరుస్తున్నది. అది జర్మన్ తత్వశాస్త్రంలోనూ, ఇంగ్లీషు అర్థశాస్త్రంలోనూ, ఫ్రెంచి సోషలిజంలోనూ వ్యక్తమైన విధంగా పందొమ్మిదవ శతాబ్దంతో మానవాళి సృజించిన దానిలో ఉత్తమమైన దానికి న్యాయమైన వారసురాలు. మార్క్సిజం మూడు మూలాధారాలను గురించి, దాని అంశీభూతాలు కూడా అయిన మూడు భాగాలను గురించీ మహత్తర అక్టోబర్ సోషలిస్టు విప్లవ నేత వ్లదిమీర్ ఇల్యిచ్ లెనిన్ ఈ పుస్తకంలో క్లుప్తంగా వివరించారు.
మానవ జాతిలో అగ్రశ్రేణికి చెందిన భావుకులు ఇదివరకే లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వడంలోనే మార్క్స్ ప్రతిభ వుంది. తత్వశాస్త్రంలోనూ, అర్థశాస్త్రంలోనూ, సోషలిజంలోనూ మహాపండితులైన వారి బోధలకు సూటి అయిన తక్షణమైన కొనసాగింపుగానే మార్క్స్ సిద్ధాంతం వుద్భవించింది. మార్క్సిస్టు సిద్ధాంతం సర్వశక్తివంతమైనది, ఎందుకంటే అది సత్యమైనది. అది సమగ్రమైనది, సమరసమైనది, ఏ రకమైన మూఢ నమ్మకంతోగానీ, అభివృద్ధి నిరోధకత్వంతోగానీ, బూర్జువా పీడనను సమర్థించడంతోగానీ రాజీపడని పరిపూర్ణమైన ప్రపంచ దృక్పథాన్ని మానవులకు సమకూరుస్తున్నది. అది జర్మన్ తత్వశాస్త్రంలోనూ, ఇంగ్లీషు అర్థశాస్త్రంలోనూ, ఫ్రెంచి సోషలిజంలోనూ వ్యక్తమైన విధంగా పందొమ్మిదవ శతాబ్దంతో మానవాళి సృజించిన దానిలో ఉత్తమమైన దానికి న్యాయమైన వారసురాలు. మార్క్సిజం మూడు మూలాధారాలను గురించి, దాని అంశీభూతాలు కూడా అయిన మూడు భాగాలను గురించీ మహత్తర అక్టోబర్ సోషలిస్టు విప్లవ నేత వ్లదిమీర్ ఇల్యిచ్ లెనిన్ ఈ పుస్తకంలో క్లుప్తంగా వివరించారు.© 2017,www.logili.com All Rights Reserved.