మూడు పుణ్యనదుల పుష్కర శోభ
పుష్కరముల ప్రశస్తి
పుణ్యభూమి భారతి. ఎందరో పుణ్యస్త్రీలు, పుణ్య పురుషులు ఉద్భవించారు. ఎన్నో పుణ్య క్షేత్రములు, పుణ్య తీర్థములు వెలసి వున్నాయి. మన భూమి వేద భూమి మాత్రమే కాదు. ధర్మభూమి కర్మభూమి కూడా, మనము హిందువులము. మనది హిందూ మతము. మనదేశం ఏ ఇతర దేశస్థులో కనుగొనిన దేశం కాదు. మన మతము ఏ ఒక్కరితోనో స్థాపించబడినది గాదు. ఏ ఒక్క సంవత్సరములోనో, ఏ తేదీనో, ఏ ఒక్క వ్యక్తో పునాది వేసినది గాదు. అతి పురాతనమైనది. అతి సనాతనమైనది. "ఓం"కార శబ్దము నుండి వెలువడిన వేదాలను ప్రామాణికముగా పొందినది. ధర్మార్థ కామ మోక్షాలను సాధనముగా కలది. "పునరపి జననం, పునరపి మరణం" అనే మూల సిద్ధాంతముపై ఆధారపడినది. వేదాలకు తోడు మానవ మనుగడకు గావలసిన నీతి నియమాలను వివరించే స్మృతులు అనబడే శాస్త్రాలను, ఇతిహాసాలను, పురాణాలను అందించిన మహోన్నత సువిశాల, సుప్రసిద్ధమైన ధార్మిక భూమి మనది.
మనది నదుల్ని దేవతలుగా కొలిచే సంస్కృతి
పరోపకారాయ ఫలంతి వృక్షాః / పరోపకారాయ వహంతి నద్యః ....' అని తెలిపే సూక్తి, నదీ ప్రవాహాల్లో పరోపకారమనే అంతరార్థముందని చెబుతుంది. అందుకే నదుల్ని దేవతలుగా కొలిచే సంప్రదాయం మన సంస్కృతిలో ఉంది. పూజా పురస్కారాల్లో చెప్పుకునే సంకల్పంలో తాముండే ప్రాంతాలను నదుల రీత్యా చెప్పుకోవడంలోనే వాటి ప్రాముఖ్యతేమిటో తెలుస్తుంది. నదిలో స్నానమాడితే పాపాలు తొలగిపోతాయనే విశ్వాసం ప్రబలింది. ఇలా పాపులందరూమునిగి పునీతులవుతుంటే ఆ నదులు వారి పాపాలను స్వీకరించి అపవిత్రమవు తున్నాయన్న కారణంగా పుష్కరుడు 12 ఏళ్ళ కొకసారి ఆయా నదుల్లో మునిగి వాటిని మళ్ళీ పవిత్ర నదులుగా మారుస్తాడని పురాణ
గాథ.
పుష్కరుడు ఏ నదిలో ఎప్పుడు ప్రవేశిస్తాడనేదానికి ఓ లెక్క ఉంది. గంగా నది మొదలుకొని మనదేశంలో ఉన్న భిన్న నదులకు రాశుల్ని నిర్ణయించి బృహస్పతి ఆయా
మూడు పుణ్యనదుల పుష్కర శోభ పుష్కరముల ప్రశస్తి పుణ్యభూమి భారతి. ఎందరో పుణ్యస్త్రీలు, పుణ్య పురుషులు ఉద్భవించారు. ఎన్నో పుణ్య క్షేత్రములు, పుణ్య తీర్థములు వెలసి వున్నాయి. మన భూమి వేద భూమి మాత్రమే కాదు. ధర్మభూమి కర్మభూమి కూడా, మనము హిందువులము. మనది హిందూ మతము. మనదేశం ఏ ఇతర దేశస్థులో కనుగొనిన దేశం కాదు. మన మతము ఏ ఒక్కరితోనో స్థాపించబడినది గాదు. ఏ ఒక్క సంవత్సరములోనో, ఏ తేదీనో, ఏ ఒక్క వ్యక్తో పునాది వేసినది గాదు. అతి పురాతనమైనది. అతి సనాతనమైనది. "ఓం"కార శబ్దము నుండి వెలువడిన వేదాలను ప్రామాణికముగా పొందినది. ధర్మార్థ కామ మోక్షాలను సాధనముగా కలది. "పునరపి జననం, పునరపి మరణం" అనే మూల సిద్ధాంతముపై ఆధారపడినది. వేదాలకు తోడు మానవ మనుగడకు గావలసిన నీతి నియమాలను వివరించే స్మృతులు అనబడే శాస్త్రాలను, ఇతిహాసాలను, పురాణాలను అందించిన మహోన్నత సువిశాల, సుప్రసిద్ధమైన ధార్మిక భూమి మనది. మనది నదుల్ని దేవతలుగా కొలిచే సంస్కృతి పరోపకారాయ ఫలంతి వృక్షాః / పరోపకారాయ వహంతి నద్యః ....' అని తెలిపే సూక్తి, నదీ ప్రవాహాల్లో పరోపకారమనే అంతరార్థముందని చెబుతుంది. అందుకే నదుల్ని దేవతలుగా కొలిచే సంప్రదాయం మన సంస్కృతిలో ఉంది. పూజా పురస్కారాల్లో చెప్పుకునే సంకల్పంలో తాముండే ప్రాంతాలను నదుల రీత్యా చెప్పుకోవడంలోనే వాటి ప్రాముఖ్యతేమిటో తెలుస్తుంది. నదిలో స్నానమాడితే పాపాలు తొలగిపోతాయనే విశ్వాసం ప్రబలింది. ఇలా పాపులందరూమునిగి పునీతులవుతుంటే ఆ నదులు వారి పాపాలను స్వీకరించి అపవిత్రమవు తున్నాయన్న కారణంగా పుష్కరుడు 12 ఏళ్ళ కొకసారి ఆయా నదుల్లో మునిగి వాటిని మళ్ళీ పవిత్ర నదులుగా మారుస్తాడని పురాణ గాథ. పుష్కరుడు ఏ నదిలో ఎప్పుడు ప్రవేశిస్తాడనేదానికి ఓ లెక్క ఉంది. గంగా నది మొదలుకొని మనదేశంలో ఉన్న భిన్న నదులకు రాశుల్ని నిర్ణయించి బృహస్పతి ఆయా© 2017,www.logili.com All Rights Reserved.