తెలుగు చిత్ర రంగంలో చిరకీర్తి నార్జించిన జంధ్యాలకు,
రచనాపరంగా, సంగీతపరంగా, దృశ్యపరంగా
ఆయన సాధించిన విజయాలకు నిలువెత్తు నివాళి ఈ పుస్తకం.
జంధ్యాల దర్సకత్వం వహించిన 39 సినిమాల చిత్రకథ,
నటీనటుల పూర్వాపరాలు, నిర్మాణంలో తమాషాలు,
షూటింగ్ విశేషాలు, మెచ్చు తునకలైన డైలాగ్స్, పాతాళ పల్లవులు,
స్టిల్స్, వర్కింగ్ స్టిల్స్, చిత్ర జయాపజయాల సమీక్షా.....
ఇలా ఒక్కో సినిమా గురించి విశ్లేషిస్తూ
జంధ్యాల దర్శకత్వ ప్రతిభను సంపూర్ణంగా ఆవిష్కరించిన
ఈ పుస్తకం-తెలుగు పుస్తక రంగంలోనే ప్రప్రథమ ప్రయోగం!
"తెలుగు సినిమాలో హాస్యం ఉన్నంత వరకు జంధ్యాల చిరంజీవే"
-వరప్రసాద్ రెడ్డి.
జంధ్యాల అన్న మూడక్షరాలు చెవిన పడగానే తెలుగు సినిమా అభిమానుల పెదాలపై చిరునవ్వు చిందులు వేస్తుంది. రచయితగా జంధ్యాల నవరసాలను అద్భుతంగా పలికించినా, హాస్య రసంలో అయన ఒలికించిన రచన తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంటుందని నేడు కొత్తగా చెప్పనవసరం లేదు. నటనలో హాస్యాన్ని పలికించడం ఎంతటి కత్తి మీద సామో, దానిని రచనలో చిలికించడం కూడా అంతటి సాహసమే. అయన రూపొందించిన చిత్రాలలో ఒకటి అరా మినహాయిస్తే అధిక శాతం హాస్యంతో అలరించినవే కనిపిస్తాయి.
రచయితగా అంత్యప్రాసలతో ఆటాడుకున్న జంధ్యాల, దర్శకుడిగాను తనదైన మార్కుని పలికించారు. అయన దర్సకత్వం వహించిన అన్ని చిత్రాలను ఒక వరుస క్రమంలో చూడడం అరుదైన విషయం. ఇక అయన చిత్రాల తేర వెనుక విషయాలు తెలుసుకోవడం అరుదైన విషయమే! జంధ్యాల అభిమానులను అలరించేందుకు చిన్నారాయణ ఆయన చిత్రాల తెరవెనుక విషయాలను కూడా చక్కగా సేకరించి ఇందులో పొందుపరచడం అభినందనీయం. "నవ్వడం యోగం, నవ్వించడం భోగం, నవ్వకపోవడం ఒక రోగం" అని చాటిన జంధ్యాల మనల్ని వదలి వెళ్ళిపోయినా, ఆయన పంచిన నవ్వుల పువ్వులే ఆయనను మన హృదయాల్లో సజివుని చేస్తాయి. ఆ నవ్వుల పరిమళాలు ఈ గ్రంథంలో గుబళీస్తాయనిపిస్తోంది.
-చిరంజీవి.(నటుడు)
తెలుగు చిత్ర రంగంలో చిరకీర్తి నార్జించిన జంధ్యాలకు, రచనాపరంగా, సంగీతపరంగా, దృశ్యపరంగా ఆయన సాధించిన విజయాలకు నిలువెత్తు నివాళి ఈ పుస్తకం. జంధ్యాల దర్సకత్వం వహించిన 39 సినిమాల చిత్రకథ, నటీనటుల పూర్వాపరాలు, నిర్మాణంలో తమాషాలు, షూటింగ్ విశేషాలు, మెచ్చు తునకలైన డైలాగ్స్, పాతాళ పల్లవులు, స్టిల్స్, వర్కింగ్ స్టిల్స్, చిత్ర జయాపజయాల సమీక్షా..... ఇలా ఒక్కో సినిమా గురించి విశ్లేషిస్తూ జంధ్యాల దర్శకత్వ ప్రతిభను సంపూర్ణంగా ఆవిష్కరించిన ఈ పుస్తకం-తెలుగు పుస్తక రంగంలోనే ప్రప్రథమ ప్రయోగం! "తెలుగు సినిమాలో హాస్యం ఉన్నంత వరకు జంధ్యాల చిరంజీవే" -వరప్రసాద్ రెడ్డి. జంధ్యాల అన్న మూడక్షరాలు చెవిన పడగానే తెలుగు సినిమా అభిమానుల పెదాలపై చిరునవ్వు చిందులు వేస్తుంది. రచయితగా జంధ్యాల నవరసాలను అద్భుతంగా పలికించినా, హాస్య రసంలో అయన ఒలికించిన రచన తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంటుందని నేడు కొత్తగా చెప్పనవసరం లేదు. నటనలో హాస్యాన్ని పలికించడం ఎంతటి కత్తి మీద సామో, దానిని రచనలో చిలికించడం కూడా అంతటి సాహసమే. అయన రూపొందించిన చిత్రాలలో ఒకటి అరా మినహాయిస్తే అధిక శాతం హాస్యంతో అలరించినవే కనిపిస్తాయి. రచయితగా అంత్యప్రాసలతో ఆటాడుకున్న జంధ్యాల, దర్శకుడిగాను తనదైన మార్కుని పలికించారు. అయన దర్సకత్వం వహించిన అన్ని చిత్రాలను ఒక వరుస క్రమంలో చూడడం అరుదైన విషయం. ఇక అయన చిత్రాల తేర వెనుక విషయాలు తెలుసుకోవడం అరుదైన విషయమే! జంధ్యాల అభిమానులను అలరించేందుకు చిన్నారాయణ ఆయన చిత్రాల తెరవెనుక విషయాలను కూడా చక్కగా సేకరించి ఇందులో పొందుపరచడం అభినందనీయం. "నవ్వడం యోగం, నవ్వించడం భోగం, నవ్వకపోవడం ఒక రోగం" అని చాటిన జంధ్యాల మనల్ని వదలి వెళ్ళిపోయినా, ఆయన పంచిన నవ్వుల పువ్వులే ఆయనను మన హృదయాల్లో సజివుని చేస్తాయి. ఆ నవ్వుల పరిమళాలు ఈ గ్రంథంలో గుబళీస్తాయనిపిస్తోంది. -చిరంజీవి.(నటుడు)Its very nice book. Its all Jandhyala. Hats off to Writer for research about these films.....
© 2017,www.logili.com All Rights Reserved.