సినిమా జర్నలిస్టులందరితోనూ నాకు సన్నిహిత సంబంధాలున్నాయి. అందులో పులగం చిన్నారాయణతో మరీనూ.. కనకధారా వాళ్ళు ఇంద్రగంటి మోహనకృష్ణతో 'గ్రహణం' తీస్తున్నప్పుడు అతన్ని పిఆర్ ఓగా పెట్టుకున్నాం. మాకు జాతీయ అవార్డు వచ్చింది. అదో సెంటిమెంటు. నా 'మిథునం'కీ అతనే పిఆర్ ఓ. ఇవన్నీ పక్కన పెడితే.. సినిమాల పై అతను చేసిన రీసెర్చి. అతను రాసిన సినిమా పుస్తకాలూ ఇలా ప్రతీదీ పిహెచ్ డీకి అర్హమైనవి. అంత శ్రమ పడతాడు. వెండితెర చరిత్రకి బంగారు మలాము పూసి అతను రాసిన 'పసిడితెర' వెలుగులు. చలనచిత్ర చరిత్రలో శాశ్వతం అవుతాయని నా ఆకాంక్ష. ఈ పుస్తకం చదువుతుంటే మీకు పులకింతలు వస్తాయి.. నన్ను నమ్మండి.
నిజజీవితానికి అద్దంపట్టే కళాత్మక చిత్రాలు, సామాజిక విలువలు పాటిస్తూనే, వినోదాంశాలతో నిర్మించే వాణిజ్య ప్రధానమైన చిత్రాలు. ఈ రెండు కూడా సినిమా కళలోభాగమే. అలాంటి ఉన్నతమైన తెలుగు సినిమాల పట్ల అవగాహన పెంచుకోవాలని ఆశించే సినిమా అభిమానుల కోసం ఎంపిక చేసిన 100 చిత్రాల సమాహారమే ఈ పసిడితెర.
- తనికెళ్ళభరణి
సినిమా జర్నలిస్టులందరితోనూ నాకు సన్నిహిత సంబంధాలున్నాయి. అందులో పులగం చిన్నారాయణతో మరీనూ.. కనకధారా వాళ్ళు ఇంద్రగంటి మోహనకృష్ణతో 'గ్రహణం' తీస్తున్నప్పుడు అతన్ని పిఆర్ ఓగా పెట్టుకున్నాం. మాకు జాతీయ అవార్డు వచ్చింది. అదో సెంటిమెంటు. నా 'మిథునం'కీ అతనే పిఆర్ ఓ. ఇవన్నీ పక్కన పెడితే.. సినిమాల పై అతను చేసిన రీసెర్చి. అతను రాసిన సినిమా పుస్తకాలూ ఇలా ప్రతీదీ పిహెచ్ డీకి అర్హమైనవి. అంత శ్రమ పడతాడు. వెండితెర చరిత్రకి బంగారు మలాము పూసి అతను రాసిన 'పసిడితెర' వెలుగులు. చలనచిత్ర చరిత్రలో శాశ్వతం అవుతాయని నా ఆకాంక్ష. ఈ పుస్తకం చదువుతుంటే మీకు పులకింతలు వస్తాయి.. నన్ను నమ్మండి. నిజజీవితానికి అద్దంపట్టే కళాత్మక చిత్రాలు, సామాజిక విలువలు పాటిస్తూనే, వినోదాంశాలతో నిర్మించే వాణిజ్య ప్రధానమైన చిత్రాలు. ఈ రెండు కూడా సినిమా కళలోభాగమే. అలాంటి ఉన్నతమైన తెలుగు సినిమాల పట్ల అవగాహన పెంచుకోవాలని ఆశించే సినిమా అభిమానుల కోసం ఎంపిక చేసిన 100 చిత్రాల సమాహారమే ఈ పసిడితెర. - తనికెళ్ళభరణి© 2017,www.logili.com All Rights Reserved.