తెలుగు పత్రికా రంగానికి ఘనమైన చరిత్ర ఉంది. తెలుగు పత్రికా రంగం తొలినాళ్ళ ఆంధ్ర జర్నలిస్టులకు, పత్రికాధిపతులకు, అంతకు మించిన ఘనత ఉంది, చరిత్ర ఉంది. మన పత్రికాధిపతులకు, ఒకనాటి జర్నలిస్టులకు పత్రికలకు మించిన ఉన్నతస్థానం రావడానికి కారణాలు వున్నాయి. నాటి ఆంధ్రజర్నలిస్టులు కొందరు ఇంగ్లీషు పత్రికలలో పనిచేయడం వల్ల తెలుగు పత్రికలలో పని చేసిన వారి కంటే ఎక్కువ కీర్తి గడించారు. దేశవ్యాప్తంగా వారికి అభిమానులు ఏర్పడ్డారు.
ఇక తెలుగులో అలనాటి ప్రసిద్ధ సాహితీవేత్తలు పలువురు పత్రికలను స్థాపించినవారే, శ్రీయుతులు శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి, చిలకమర్తి లక్ష్మీ నరసింహం, తల్లావఝుల శివశంకరశాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ, మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి, అడవి బాపిరాజు, జంధ్యాల పాపయ్యశాస్త్రి మొదలైనవారు అలా పత్రికలను పెట్టి కొంతకాలం నడిపారు. ఈ విధంగా తెలుగువారైన కొందరు జర్నలిస్టులూ, పత్రికాధిపతులూ, తెలుగు పత్రికలకు మించిన కీర్తి శిఖరాలను చేరుకున్నారు.
ఇంతటి ఘన చరిత్ర కలిగిన తెలుగు జర్నలిజం గురించి పాఠకులకు తెలియవలిసిన అవసరం ఉంది. ఇప్పుడు మీ చేతులలో వున్న పుస్తకం అలాంటి అవసరాన్ని తీరుస్తుంది. గ్రంథకర్త శ్రీ కంచి వాసుదేవరావు తెలుగునాట సీనియర్ జర్నలిస్టులలో ఒకరు. చదివిన చదువును బట్టి ఫార్మాసిస్టు కావలసిన వారు జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకున్నారు. ధనార్జనే ధ్యేయమైతే ఆయన ఫార్మాసిస్టు గానే స్థిరపడి ఉండేవారు. జర్నలిజంలోకి ప్రవేశించినప్పుడు సైతం ఇందులో పెద్దగా ఆదాయం లేదన్న సంగతి ఆయనకు తెలియదని అనుకోలేము. ఐనప్పటికీ జర్నలిజం వృత్తిలో చేరారంటే అది ఆయన అభిరుచినీ, పట్టుదలనూ సూచిస్తుంది.
తెలుగు పత్రికా రంగానికి ఘనమైన చరిత్ర ఉంది. తెలుగు పత్రికా రంగం తొలినాళ్ళ ఆంధ్ర జర్నలిస్టులకు, పత్రికాధిపతులకు, అంతకు మించిన ఘనత ఉంది, చరిత్ర ఉంది. మన పత్రికాధిపతులకు, ఒకనాటి జర్నలిస్టులకు పత్రికలకు మించిన ఉన్నతస్థానం రావడానికి కారణాలు వున్నాయి. నాటి ఆంధ్రజర్నలిస్టులు కొందరు ఇంగ్లీషు పత్రికలలో పనిచేయడం వల్ల తెలుగు పత్రికలలో పని చేసిన వారి కంటే ఎక్కువ కీర్తి గడించారు. దేశవ్యాప్తంగా వారికి అభిమానులు ఏర్పడ్డారు. ఇక తెలుగులో అలనాటి ప్రసిద్ధ సాహితీవేత్తలు పలువురు పత్రికలను స్థాపించినవారే, శ్రీయుతులు శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి, చిలకమర్తి లక్ష్మీ నరసింహం, తల్లావఝుల శివశంకరశాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ, మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి, అడవి బాపిరాజు, జంధ్యాల పాపయ్యశాస్త్రి మొదలైనవారు అలా పత్రికలను పెట్టి కొంతకాలం నడిపారు. ఈ విధంగా తెలుగువారైన కొందరు జర్నలిస్టులూ, పత్రికాధిపతులూ, తెలుగు పత్రికలకు మించిన కీర్తి శిఖరాలను చేరుకున్నారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన తెలుగు జర్నలిజం గురించి పాఠకులకు తెలియవలిసిన అవసరం ఉంది. ఇప్పుడు మీ చేతులలో వున్న పుస్తకం అలాంటి అవసరాన్ని తీరుస్తుంది. గ్రంథకర్త శ్రీ కంచి వాసుదేవరావు తెలుగునాట సీనియర్ జర్నలిస్టులలో ఒకరు. చదివిన చదువును బట్టి ఫార్మాసిస్టు కావలసిన వారు జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకున్నారు. ధనార్జనే ధ్యేయమైతే ఆయన ఫార్మాసిస్టు గానే స్థిరపడి ఉండేవారు. జర్నలిజంలోకి ప్రవేశించినప్పుడు సైతం ఇందులో పెద్దగా ఆదాయం లేదన్న సంగతి ఆయనకు తెలియదని అనుకోలేము. ఐనప్పటికీ జర్నలిజం వృత్తిలో చేరారంటే అది ఆయన అభిరుచినీ, పట్టుదలనూ సూచిస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.