అత్యంత సారవంతమైన, 365 రోజులూ కూరగాయలు, అరటి, జామ, సపోట మున్నగు ఉద్యాన పంటలు, మల్లె, కనకాంబరాలు వంటి పూలు, ప్రత్తి, మిర్చి వంటి వాణిజ్య పంటలతో కళకళలాడుతూ వుండే అమరావతి ప్రాంతంలో జరీబు భూములను మినహాయించి, తుళ్ళూరు - పెనుమాక రహదారికి దక్షిణపు వైపున వున్న మెట్ట భూములలో సుమారు 10 వేల ఎకరాలు సేకరించి రాజధాని నిర్మాణం చేసుకొంటే ఉత్తమంగా వుంటుందని నేను భావించడమేకాక, నా అభిప్రాయాలతో ఏకీభవించిన వారితో కలిసి పత్రికా సమావేశాల ద్వారా, వ్యాసాల ద్వారా తెలియపర్చటమే కాక, రాజధానితో ముడిపడిన సింగపూర్ సంస్థలతో స్విస్ ఛాలెంజ్ విధానంలో ఒప్పందం” రాష్ట్రానికి నష్టదాయకమని, మున్నగు అంశాల పైన చిరు పుస్తకములు ప్రచురించడమేకాక ఈ విషయాలను నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అంతేకాక వాటర్‌మాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్, ప్రముఖ పర్యావరణ వేత్తలు విక్రమ్ సోనీ, మేధాపాట్కర్, సుప్రీం కోర్టు న్యాయవాది సంజయ్ పరేఖ్ మున్నగు ప్రముఖులు రూపొందించిన “అమరావతి-సహజ రాజధాని నగరం” పుస్తకంను రూపొందించగా, దానిని చంద్రబాబు గారికి మరియు ప్రభుత్వములోని పెద్దలకు పంపడం జరిగింది. కానీ ప్రభుత్వం నుండి ఎంతమాత్రమూ స్పందన వ్యక్తం కాలేదు! -
అత్యంత సారవంతమైన, 365 రోజులూ కూరగాయలు, అరటి, జామ, సపోట మున్నగు ఉద్యాన పంటలు, మల్లె, కనకాంబరాలు వంటి పూలు, ప్రత్తి, మిర్చి వంటి వాణిజ్య పంటలతో కళకళలాడుతూ వుండే అమరావతి ప్రాంతంలో జరీబు భూములను మినహాయించి, తుళ్ళూరు - పెనుమాక రహదారికి దక్షిణపు వైపున వున్న మెట్ట భూములలో సుమారు 10 వేల ఎకరాలు సేకరించి రాజధాని నిర్మాణం చేసుకొంటే ఉత్తమంగా వుంటుందని నేను భావించడమేకాక, నా అభిప్రాయాలతో ఏకీభవించిన వారితో కలిసి పత్రికా సమావేశాల ద్వారా, వ్యాసాల ద్వారా తెలియపర్చటమే కాక, రాజధానితో ముడిపడిన సింగపూర్ సంస్థలతో స్విస్ ఛాలెంజ్ విధానంలో ఒప్పందం” రాష్ట్రానికి నష్టదాయకమని, మున్నగు అంశాల పైన చిరు పుస్తకములు ప్రచురించడమేకాక ఈ విషయాలను నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అంతేకాక వాటర్‌మాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్, ప్రముఖ పర్యావరణ వేత్తలు విక్రమ్ సోనీ, మేధాపాట్కర్, సుప్రీం కోర్టు న్యాయవాది సంజయ్ పరేఖ్ మున్నగు ప్రముఖులు రూపొందించిన “అమరావతి-సహజ రాజధాని నగరం” పుస్తకంను రూపొందించగా, దానిని చంద్రబాబు గారికి మరియు ప్రభుత్వములోని పెద్దలకు పంపడం జరిగింది. కానీ ప్రభుత్వం నుండి ఎంతమాత్రమూ స్పందన వ్యక్తం కాలేదు! -© 2017,www.logili.com All Rights Reserved.