ఇది ఒక ప్రయాణం. ఇందులో ఒక యువకుడు తను పుట్టి పెరిగిన మారుమూల గ్రామం నుంచి దేశ రాజధాని వరకు ప్రయాణిస్తాడు. పేదరికంలో జీవిస్తూనే అతను ఒక ప్రతిఘటనా శక్తిగా ఎదుగుతాడు. ఫిబ్రవరి 2016 లో జె. ఎన్. యు. విద్యార్థి సంఘ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ రాజద్రోహ నేరం పై అరెస్టు అయి జైలుకి పంపబడతాడు. పాటియాలా హౌస్ కోర్టులో లాయర్లు అతన్ని కొట్టారు. ఇలాంటి విషమ పరిస్థితుల్లో అతను ఒక యువరాజకీయ నాయకునిగా పుట్టుకొస్తాడు. ఇతని గురించి బిబిసి భారతదేశంలో అందరికంటే ఎక్కువగా అభిమానించబడిన, ద్వేషించబడిన వ్యక్తిగా, విద్యార్థిగా కీర్తించింది. ఇది అతని కథ, బీహార్ లో అతను పుట్టిన గ్రామంలో తను గడిపిన బాల్యం, పాట్నా కాలేజీ రోజుల నుండి ఢిల్లీ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారే వరకు ఉన్న కథ. ఈ కథను కన్నయ్య కుమార్ సజీవంగా అసాధారణమైన రీతిలో గాయపడిన హృదయంతో వినిపిస్తున్నాడు. అతని ఆలోచనలు నిర్భయంగా ఉంటాయి. నిలువెల్లా తిరుగుబాటు భావనలతో నిండి ఉంటాయి. బీహార్ నుంచి తీహార్ వరకు ఈ దేశంలో రాయబడిన అసాధారణమైన ఆత్మ కథల్లో ఇది ఒకటి. - డా. జి. వి. రత్నాకర్
ఇది ఒక ప్రయాణం. ఇందులో ఒక యువకుడు తను పుట్టి పెరిగిన మారుమూల గ్రామం నుంచి దేశ రాజధాని వరకు ప్రయాణిస్తాడు. పేదరికంలో జీవిస్తూనే అతను ఒక ప్రతిఘటనా శక్తిగా ఎదుగుతాడు. ఫిబ్రవరి 2016 లో జె. ఎన్. యు. విద్యార్థి సంఘ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ రాజద్రోహ నేరం పై అరెస్టు అయి జైలుకి పంపబడతాడు. పాటియాలా హౌస్ కోర్టులో లాయర్లు అతన్ని కొట్టారు. ఇలాంటి విషమ పరిస్థితుల్లో అతను ఒక యువరాజకీయ నాయకునిగా పుట్టుకొస్తాడు. ఇతని గురించి బిబిసి భారతదేశంలో అందరికంటే ఎక్కువగా అభిమానించబడిన, ద్వేషించబడిన వ్యక్తిగా, విద్యార్థిగా కీర్తించింది.ఇది అతని కథ, బీహార్ లో అతను పుట్టిన గ్రామంలో తను గడిపిన బాల్యం, పాట్నా కాలేజీ రోజుల నుండి ఢిల్లీ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారే వరకు ఉన్న కథ. ఈ కథను కన్నయ్య కుమార్ సజీవంగా అసాధారణమైన రీతిలో గాయపడిన హృదయంతో వినిపిస్తున్నాడు. అతని ఆలోచనలు నిర్భయంగా ఉంటాయి. నిలువెల్లా తిరుగుబాటు భావనలతో నిండి ఉంటాయి. బీహార్ నుంచి తీహార్ వరకు ఈ దేశంలో రాయబడిన అసాధారణమైన ఆత్మ కథల్లో ఇది ఒకటి. - డా. జి. వి. రత్నాకర్