ఇది సినీమా వ్యాసాల సంపుటి. ముందుగా సినీమాను తలదన్నే గొప్ప సినీమాలాంటి సంఘటన. దాదాపు 35-40 ఏళ్ల కిందట - ఓ చిరిగిపోయిన కాగితం మీద ఒక కవిత కనిపించింది. రచయిత పేరు వంశీకృష్ణ. కవిత నాకు చాలా నచ్చింది. ఎంత నచ్చిందంటే ఆ కవితని నా డైరీలో వ్రాసి ఉంచుకున్నాను. కవిత పేరు 'ఒక మాజీ ప్రేయసి'.
కవితలో కొన్ని వాంక్తులివి:
"నేను గుర్తున్నానా?
నీటి కురులంతమెత్తనయినా దాన్ని
గాలి అలలంత చల్లనైన దాన్ని
అశాంతి రేఖ అంచున నువ్వు నిలిచినప్పుడు లిపి తెలీని నీ భాషకు భాష్యమైనదాన్ని
..... .... ....
నాలుగు రోడ్ల కూడలిలో నీ నవ్వుల నావ శిలువెక్కినప్పుడు
అక్షరమై నిన్ను సముదాయించి దాన్ని
పచ్చ పచ్చటి బతుకు పొలాల్లోంచి
వెచ్చ వెచ్చటి నెత్తుటి కాలువలు ప్రవహించినప్పుడు
చందమామ మలామా చేసిన దాన్ని
చందన గంధమై నిన్ను అలదిన దాన్ని"
- వంశీకృష్ణ