మనిషి మనీషిగా కావడానికి కావలసిన విధి విధానాల్నీ ఈ గ్రంధంలో ఉన్నాయి. చాలా మంది శ్వాస మీద ధ్యాస పెట్టండి అనో, ఆసనాలను వెయ్యండి లేదా జిమ్ కి వెళ్ళండి ఆరోగ్యం మెరుగవుతుంది, గుండెకి మంచిది అని చెపుతుంటారు.
కానీ నిజమైన ఆరోగ్యం అంటే ఏమిటి? శారీరకంగానే కాకుండా మానసికంగా, స్పిరిట్యువల్ గా, ఎమోషనల్ గా కూడా ఆరోగ్యంగా ఉండండి. దీనికి పలుమార్లు మనల్ని మనం తరచి తరచి ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. వీటన్నిటికి ఋషి పతంజలి ఎప్పుడో చెప్పిన విధివిధానాల సాధనే పరిష్కారం.
యోగసాధన, ప్రాణాయామము, ధ్యానము అన్ని వయస్సుల వారు చేయుటకు వీలుగా వ్రాయబడినది. రోగాలకి కారణము ఆలోచనా విధానమని ఒక డాక్టరుగా నేనూ ఏకీభవిస్తున్నాను. సాధన ద్వారా మంచి ఆలోచనలని స్వంతం చేసుకోండి. ఈ కోణం నుంచి 'ఈ చిన్న పుస్తకం ఒక పుస్తక రాజ్యమే' అని చెప్పవలసి ఉంటుంది.
అన్ని విషయాలకు, పురాణ ఇతిహాసాల నుండీ భగవద్గీత నుండి తగు మూలాలతో చేర్చి కూర్చిన ఈ గ్రంథం, ఒకసారి కాదు అనేక సార్లు చదివి, గ్రహించి ఆకళించుకుని, నిత్య జీవితంలో ప్రతివారు అనుసరించి తమకి తాము ఉపయోగపడుతూ, తనచుట్టూ ఉన్న వారికి కూడా ఉపయోగపడగలరని ఆశిస్తున్నాము.
- డా. మెట్టపల్లి జగన్ మోహన్
మనిషి మనీషిగా కావడానికి కావలసిన విధి విధానాల్నీ ఈ గ్రంధంలో ఉన్నాయి. చాలా మంది శ్వాస మీద ధ్యాస పెట్టండి అనో, ఆసనాలను వెయ్యండి లేదా జిమ్ కి వెళ్ళండి ఆరోగ్యం మెరుగవుతుంది, గుండెకి మంచిది అని చెపుతుంటారు. కానీ నిజమైన ఆరోగ్యం అంటే ఏమిటి? శారీరకంగానే కాకుండా మానసికంగా, స్పిరిట్యువల్ గా, ఎమోషనల్ గా కూడా ఆరోగ్యంగా ఉండండి. దీనికి పలుమార్లు మనల్ని మనం తరచి తరచి ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. వీటన్నిటికి ఋషి పతంజలి ఎప్పుడో చెప్పిన విధివిధానాల సాధనే పరిష్కారం. యోగసాధన, ప్రాణాయామము, ధ్యానము అన్ని వయస్సుల వారు చేయుటకు వీలుగా వ్రాయబడినది. రోగాలకి కారణము ఆలోచనా విధానమని ఒక డాక్టరుగా నేనూ ఏకీభవిస్తున్నాను. సాధన ద్వారా మంచి ఆలోచనలని స్వంతం చేసుకోండి. ఈ కోణం నుంచి 'ఈ చిన్న పుస్తకం ఒక పుస్తక రాజ్యమే' అని చెప్పవలసి ఉంటుంది. అన్ని విషయాలకు, పురాణ ఇతిహాసాల నుండీ భగవద్గీత నుండి తగు మూలాలతో చేర్చి కూర్చిన ఈ గ్రంథం, ఒకసారి కాదు అనేక సార్లు చదివి, గ్రహించి ఆకళించుకుని, నిత్య జీవితంలో ప్రతివారు అనుసరించి తమకి తాము ఉపయోగపడుతూ, తనచుట్టూ ఉన్న వారికి కూడా ఉపయోగపడగలరని ఆశిస్తున్నాము. - డా. మెట్టపల్లి జగన్ మోహన్© 2017,www.logili.com All Rights Reserved.