చదువు చారెడు బలపాలు దోసెడన్న చందంగా పిల్లలకు భారంగా తయారవుతున్న మన విద్యా విధానం, పుస్తకాలు, సిలబస్, బోధన మొత్తం విద్యా వ్యవస్థనే విమర్శనాత్మకంగా, సృజనాత్మకంగా ఈ పుస్తకంలో మన ముందుంచడానికి ప్రయత్నించాడు కృష్ణకుమార్. ప్రస్తుతం విద్య వ్యవస్థలో వేళ్ళూనుకోని వున్న వుదాసినత, నిర్లప్తత, నిజాయితీరాహిత్యం విద్యా ప్రమాణాలను నానాటికి మరింత నాసిరకంగా ఎలా తయారు చేస్తున్నాయో సమర్ధవంతంగా చర్చించాడు. ప్రజాస్వామ్య, ఉదార, సెక్యులర్ భావాలున్నాయని చాటుకుంటున్న ప్రస్తుత విద్య వడిలోనే మతవాదం ఎట్లా పురుడు పోసుకోగలిగిందని సవివరంగా ప్రశ్నిస్తాడు. కలగా పులగపు సమాచారంతో క్రిక్కిరిసి పోయిన పాట్యపుస్తకాలు మరీ ముఖ్యంగా ప్రాధమికోన్నత స్థాయి పిల్లలు చరిత్ర విజ్ఞాన శాస్త్ర పాట్య పుస్తకాలు యిటు పిల్లల్లోనూ అటు ఉపాద్యాయుల్లోనూ ఎంత గందరగోళాన్ని సృస్టిస్తున్నాయో, మరెంత ప్రమాదకర ధోరణి వైపున నెట్టి వేస్తున్నాయో ఈ పుస్తకం చదివితే అర్ధమవుతుంది. ఇక ఇంగ్లిష్ మీడియం చదువులు ప్రాంతీయ భాషలనూ, సంస్కృతినీ, ఆయా భాషల్లో చదువుకునే అనేకమంది ప్రభుత్వ పాఠశాలల పిల్లల గొంతులను నొక్కి వేస్తున్న తీరును అత్యంత ఆవేదనతో మన ముందుంచుతాడు క్రిష్ణకుమార్
పిల్లలపై బండెడు భారాన్ని మోపుతున్న ప్రస్తుత విద్యావిధానాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం నియమించిన యశ్ పాల్ కమిటీలో సభ్యుడిగా పనిచేసిన క్రిష్ణకుమార్ ప్రస్తుతం డిల్లీ విశ్వవిద్యాలయం విద్యావిభాగంలో ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పిల్లల పాట్య పుస్తకాలు, సిలబస్, పుస్తక రచన, బోధనా పధ్ధతి - మొత్తంగా ప్రస్తుత విద్యా వ్యవస్థ సమూలంగా మారాలని తపనపడే ప్రతివోక్కరూ చదవాల్సిన మంచి పుస్తకం "పిల్లల పాఠాలు - పెద్దలకు గుణపాఠాలు"
- క్రిష్ణకుమార్
చదువు చారెడు బలపాలు దోసెడన్న చందంగా పిల్లలకు భారంగా తయారవుతున్న మన విద్యా విధానం, పుస్తకాలు, సిలబస్, బోధన మొత్తం విద్యా వ్యవస్థనే విమర్శనాత్మకంగా, సృజనాత్మకంగా ఈ పుస్తకంలో మన ముందుంచడానికి ప్రయత్నించాడు కృష్ణకుమార్. ప్రస్తుతం విద్య వ్యవస్థలో వేళ్ళూనుకోని వున్న వుదాసినత, నిర్లప్తత, నిజాయితీరాహిత్యం విద్యా ప్రమాణాలను నానాటికి మరింత నాసిరకంగా ఎలా తయారు చేస్తున్నాయో సమర్ధవంతంగా చర్చించాడు. ప్రజాస్వామ్య, ఉదార, సెక్యులర్ భావాలున్నాయని చాటుకుంటున్న ప్రస్తుత విద్య వడిలోనే మతవాదం ఎట్లా పురుడు పోసుకోగలిగిందని సవివరంగా ప్రశ్నిస్తాడు. కలగా పులగపు సమాచారంతో క్రిక్కిరిసి పోయిన పాట్యపుస్తకాలు మరీ ముఖ్యంగా ప్రాధమికోన్నత స్థాయి పిల్లలు చరిత్ర విజ్ఞాన శాస్త్ర పాట్య పుస్తకాలు యిటు పిల్లల్లోనూ అటు ఉపాద్యాయుల్లోనూ ఎంత గందరగోళాన్ని సృస్టిస్తున్నాయో, మరెంత ప్రమాదకర ధోరణి వైపున నెట్టి వేస్తున్నాయో ఈ పుస్తకం చదివితే అర్ధమవుతుంది. ఇక ఇంగ్లిష్ మీడియం చదువులు ప్రాంతీయ భాషలనూ, సంస్కృతినీ, ఆయా భాషల్లో చదువుకునే అనేకమంది ప్రభుత్వ పాఠశాలల పిల్లల గొంతులను నొక్కి వేస్తున్న తీరును అత్యంత ఆవేదనతో మన ముందుంచుతాడు క్రిష్ణకుమార్ పిల్లలపై బండెడు భారాన్ని మోపుతున్న ప్రస్తుత విద్యావిధానాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం నియమించిన యశ్ పాల్ కమిటీలో సభ్యుడిగా పనిచేసిన క్రిష్ణకుమార్ ప్రస్తుతం డిల్లీ విశ్వవిద్యాలయం విద్యావిభాగంలో ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పిల్లల పాట్య పుస్తకాలు, సిలబస్, పుస్తక రచన, బోధనా పధ్ధతి - మొత్తంగా ప్రస్తుత విద్యా వ్యవస్థ సమూలంగా మారాలని తపనపడే ప్రతివోక్కరూ చదవాల్సిన మంచి పుస్తకం "పిల్లల పాఠాలు - పెద్దలకు గుణపాఠాలు" - క్రిష్ణకుమార్
© 2017,www.logili.com All Rights Reserved.