సినిమా రంగంతో పాటు, ముద్రణారంగంలోనూ తమదైన ముద్ర వేసినవారు - నా తండ్రి బి నాగిరెడ్డిగారు, నా గురుతుల్యులు శ్రీ చక్రపాణిగారు. వారి ఆశీస్సులతో, వారు నెలకొల్పిన 'చందమామ' పత్రిక సంపాదక బాధ్యతలు నిర్వహిస్తూనే, ఉత్తమాభిరుచిగల తెలుగు సినీ పాఠకుల కోసం 'విజయచిత్ర' పత్రికను దాదాపు మూడు దశాబ్దాలపాటు సినీ ప్రముఖులు, పాఠక దేవుళ్ళ ఆదరణతో విజయవంతంగా నడిపాము.
తొమ్మిదేళ్ళ క్రితం తెలుగు టాకీ వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో, ఇంతలా 'విజయ' సంస్థను, 'విజయచిత్ర'ను ఆదరించిన పరిశ్రమకూ, ప్రేక్షకులకు ఏదైనా కానుకందించాలన్న ఆలోచనకు కార్యరూపం ఈ 'ఆనాటి ఆనవాళ్ళు'. 1932 - 1985 మధ్య విడుదలైన నాటి మేటి 75 సినిమాల కథాంశాలతో పాటుగా, చిత్ర నిర్మాణంలో జరిగిన విశేషాలు, వ్యయ ప్రయాసలను కళ్ళకు కట్టినట్లుగా విపులంగా వివరించారు యువ పాత్రికేయులు శ్రీ పులగం చిన్నారాయణ - ఈ 'ఆనాటి ఆనవాళ్ళు'లో. నంది అవార్డు అందుకున్న ఈ పుస్తకానికి ఇది నాల్గవ ముద్రణ. ఉత్తమాభిరుచిగల సినీ అభిమానులు కొని చదివి దాచుకోదగ్గ ఈ పుస్తకాన్ని సవినయంగా సమర్పిస్తున్నాం.
- విశ్వం
సినిమా రంగంతో పాటు, ముద్రణారంగంలోనూ తమదైన ముద్ర వేసినవారు - నా తండ్రి బి నాగిరెడ్డిగారు, నా గురుతుల్యులు శ్రీ చక్రపాణిగారు. వారి ఆశీస్సులతో, వారు నెలకొల్పిన 'చందమామ' పత్రిక సంపాదక బాధ్యతలు నిర్వహిస్తూనే, ఉత్తమాభిరుచిగల తెలుగు సినీ పాఠకుల కోసం 'విజయచిత్ర' పత్రికను దాదాపు మూడు దశాబ్దాలపాటు సినీ ప్రముఖులు, పాఠక దేవుళ్ళ ఆదరణతో విజయవంతంగా నడిపాము. తొమ్మిదేళ్ళ క్రితం తెలుగు టాకీ వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో, ఇంతలా 'విజయ' సంస్థను, 'విజయచిత్ర'ను ఆదరించిన పరిశ్రమకూ, ప్రేక్షకులకు ఏదైనా కానుకందించాలన్న ఆలోచనకు కార్యరూపం ఈ 'ఆనాటి ఆనవాళ్ళు'. 1932 - 1985 మధ్య విడుదలైన నాటి మేటి 75 సినిమాల కథాంశాలతో పాటుగా, చిత్ర నిర్మాణంలో జరిగిన విశేషాలు, వ్యయ ప్రయాసలను కళ్ళకు కట్టినట్లుగా విపులంగా వివరించారు యువ పాత్రికేయులు శ్రీ పులగం చిన్నారాయణ - ఈ 'ఆనాటి ఆనవాళ్ళు'లో. నంది అవార్డు అందుకున్న ఈ పుస్తకానికి ఇది నాల్గవ ముద్రణ. ఉత్తమాభిరుచిగల సినీ అభిమానులు కొని చదివి దాచుకోదగ్గ ఈ పుస్తకాన్ని సవినయంగా సమర్పిస్తున్నాం. - విశ్వం© 2017,www.logili.com All Rights Reserved.