కరణీకం
'కరణీకం' అనే పదాన్ని గురించి తెలుసుకోబోయేముందు మనం 'కరణము' అనే పదానికున్న పలు అర్థాలేమిటో క్లుప్తంగా తెలుసుకుందాం. సామాన్యార్థంలో లెక్కరాసే ఏ వ్యక్తినైనా మనం 'కరణం' అంటాం. గ్రామ లెక్కలు రాసే గుమాస్తాను గ్రామ కరణము అంటాం. ఏదైనా ఉపకరణము లేక పనిముట్టు (Implement) లేక కొఱముట్టును కూడా కరణము అనే అంటాం. కరణము పేరుతో ఒక తరహా గీతము, వేరొక నృత్య రీతి కూడా ఉన్నాయి. త్రికరణ శుద్ధిగా ఒక పనిని చేయడం అంటే మనస్సు, వాక్కు, కాయము (శరీరము) అనే మూడు కరణములను చేసే పనిమీదనే లగ్నంచేసి లక్ష్య శు ద్ధితో పనిచేయటం. మనస్సు, వాక్కు, కర్మ - ఈ మూడింటినీ త్రికరణములు అంటారు మరి కొందరు. మనోబుద్ధి చిత్తాహంకారములు నాలుగింటినీ కరణ చతుష్టయమని అంటారు ఇంకొందరు. 'వాత్స్యాయన కామ సూత్రాల' లో వివరించిన 'తిర్యక్కరణము' వంటి పలు రతి బంధాలను కూడా కరణములు అనే అంటారు. ఈ అర్థాలన్నీ అటుంచి మనం ఇప్పుడు గ్రామ లెక్కలు రాసే కరణమును గురించి వివరంగా చూద్దాం.
కరణము సామాజిక వర్గం
కరణము అంటే శూద్రస్త్రీకి, వైశ్యునికి పుట్టినవాడని 'శబ్ద రత్నాకరము' పేర్కొంది. ఇలా అనులోమ వివాహంలో పుట్టినవారు తల్లి వర్ణాన్ని పొందుతారు కనుక కరణము శూద్ర వర్ణానికి చెందినవాడని మనం భావించాలి. కానీ వాత్యుడగు క్షత్రియునికి సవర్ణ స్త్రీ అంటే తన వర్ణం, కులమునందు పుట్టినవానిని 'కరణము' అంటారనీ, ఒక్కొక్క ప్రాంతాన్నిబట్టి వీరు ఒక్కొక్క పేరుతో................
కరణీకం 'కరణీకం' అనే పదాన్ని గురించి తెలుసుకోబోయేముందు మనం 'కరణము' అనే పదానికున్న పలు అర్థాలేమిటో క్లుప్తంగా తెలుసుకుందాం. సామాన్యార్థంలో లెక్కరాసే ఏ వ్యక్తినైనా మనం 'కరణం' అంటాం. గ్రామ లెక్కలు రాసే గుమాస్తాను గ్రామ కరణము అంటాం. ఏదైనా ఉపకరణము లేక పనిముట్టు (Implement) లేక కొఱముట్టును కూడా కరణము అనే అంటాం. కరణము పేరుతో ఒక తరహా గీతము, వేరొక నృత్య రీతి కూడా ఉన్నాయి. త్రికరణ శుద్ధిగా ఒక పనిని చేయడం అంటే మనస్సు, వాక్కు, కాయము (శరీరము) అనే మూడు కరణములను చేసే పనిమీదనే లగ్నంచేసి లక్ష్య శు ద్ధితో పనిచేయటం. మనస్సు, వాక్కు, కర్మ - ఈ మూడింటినీ త్రికరణములు అంటారు మరి కొందరు. మనోబుద్ధి చిత్తాహంకారములు నాలుగింటినీ కరణ చతుష్టయమని అంటారు ఇంకొందరు. 'వాత్స్యాయన కామ సూత్రాల' లో వివరించిన 'తిర్యక్కరణము' వంటి పలు రతి బంధాలను కూడా కరణములు అనే అంటారు. ఈ అర్థాలన్నీ అటుంచి మనం ఇప్పుడు గ్రామ లెక్కలు రాసే కరణమును గురించి వివరంగా చూద్దాం. కరణము సామాజిక వర్గం కరణము అంటే శూద్రస్త్రీకి, వైశ్యునికి పుట్టినవాడని 'శబ్ద రత్నాకరము' పేర్కొంది. ఇలా అనులోమ వివాహంలో పుట్టినవారు తల్లి వర్ణాన్ని పొందుతారు కనుక కరణము శూద్ర వర్ణానికి చెందినవాడని మనం భావించాలి. కానీ వాత్యుడగు క్షత్రియునికి సవర్ణ స్త్రీ అంటే తన వర్ణం, కులమునందు పుట్టినవానిని 'కరణము' అంటారనీ, ఒక్కొక్క ప్రాంతాన్నిబట్టి వీరు ఒక్కొక్క పేరుతో................© 2017,www.logili.com All Rights Reserved.