ఆదివారం 'ఆంధ్రజ్యోతి'లో ముప్పై వారాలపాటు ధారావాహికంగా వడ్డించబడినవే ఈ 'కూరగాధలు'. ఎందరో పాఠకులు వీటి రుచిని ఆస్వాదించారు. ఇంకెందరో మరింత సమాచారం వడ్డించమన్నారు. అందరి ఆసక్తి, అభిరుచి మేరకు ఆ గాధలే తమ పూర్తి రూపంతో, రంగురంగుల ఫోటోల తాలింపు ఘుమఘుమలతో కనువిందుచేసే పుస్తకంగా ముస్తాబై ఇలా మీ ముందుకొచ్చాయి.
'తెనాలి రామకృష్ణ కవి - శాస్త్రీయ పరిశీలన', 'శ్రమవిరులు', 'మహాకవి శ్రీశ్రీ - సిరికధ', 'పాండురంగ మహాత్మ్యం - ఒక పరిచయం', 'మన ప్రాచీనుల ఆహరం, ఆరోగ్యం, వైద్యం', 'హోమర్ ఇలియడ్' (తెలుగు అనువాదం) వంటి తన రచనలతో పాఠకలోకాన్ని మెప్పించిన రచయిత ప్రతిభకు ఈ పుస్తకం తాజా సాక్ష్యం.
కూరగాయలు మనం నిత్యం వాడుకునేవే. అయితే వాటి గురించిన ఎన్నో విషయాలు మనకు బొత్తిగా తెలియవు. ఏయే కూరగాయలు ఎక్కడ పుట్టాయి? ఎప్పుడు, ఎలా మన ప్రాంతానికి వచ్చి చేరాయి?, పలు భాషల్లో వాటిని ఏమని పిలుస్తారు?, వాటి శాస్త్రీయ నామాలేమిటి?, అవెలా ఏర్పడ్డాయి?, వివిధ కూరగాయలను ఎలా సాగు చేస్తారు?, వాటితో మనం చేసుకునే ఆహారాలేమిటి?, వాటి పోషక, ఔషధ విలువలేమిటి?, వంటి ప్రయోజనకరమైన విషయాలన్నీ ఎంతో శ్రమకోర్చి లోతుగా పరిశీలించి, చాలా ఆసక్తికరంగా మన ముందుంచారు. ఈ గాధల్ని వివరించిన తీరు అందరినీ నోరూరింపజేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? ఆరగించి ఆనందించండి.
- ముత్తేవి రవీంద్రనాథ్
ఆదివారం 'ఆంధ్రజ్యోతి'లో ముప్పై వారాలపాటు ధారావాహికంగా వడ్డించబడినవే ఈ 'కూరగాధలు'. ఎందరో పాఠకులు వీటి రుచిని ఆస్వాదించారు. ఇంకెందరో మరింత సమాచారం వడ్డించమన్నారు. అందరి ఆసక్తి, అభిరుచి మేరకు ఆ గాధలే తమ పూర్తి రూపంతో, రంగురంగుల ఫోటోల తాలింపు ఘుమఘుమలతో కనువిందుచేసే పుస్తకంగా ముస్తాబై ఇలా మీ ముందుకొచ్చాయి. 'తెనాలి రామకృష్ణ కవి - శాస్త్రీయ పరిశీలన', 'శ్రమవిరులు', 'మహాకవి శ్రీశ్రీ - సిరికధ', 'పాండురంగ మహాత్మ్యం - ఒక పరిచయం', 'మన ప్రాచీనుల ఆహరం, ఆరోగ్యం, వైద్యం', 'హోమర్ ఇలియడ్' (తెలుగు అనువాదం) వంటి తన రచనలతో పాఠకలోకాన్ని మెప్పించిన రచయిత ప్రతిభకు ఈ పుస్తకం తాజా సాక్ష్యం. కూరగాయలు మనం నిత్యం వాడుకునేవే. అయితే వాటి గురించిన ఎన్నో విషయాలు మనకు బొత్తిగా తెలియవు. ఏయే కూరగాయలు ఎక్కడ పుట్టాయి? ఎప్పుడు, ఎలా మన ప్రాంతానికి వచ్చి చేరాయి?, పలు భాషల్లో వాటిని ఏమని పిలుస్తారు?, వాటి శాస్త్రీయ నామాలేమిటి?, అవెలా ఏర్పడ్డాయి?, వివిధ కూరగాయలను ఎలా సాగు చేస్తారు?, వాటితో మనం చేసుకునే ఆహారాలేమిటి?, వాటి పోషక, ఔషధ విలువలేమిటి?, వంటి ప్రయోజనకరమైన విషయాలన్నీ ఎంతో శ్రమకోర్చి లోతుగా పరిశీలించి, చాలా ఆసక్తికరంగా మన ముందుంచారు. ఈ గాధల్ని వివరించిన తీరు అందరినీ నోరూరింపజేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? ఆరగించి ఆనందించండి. - ముత్తేవి రవీంద్రనాథ్© 2017,www.logili.com All Rights Reserved.