"కొండంత బాధని గుండెల్లో దాచుకోలేక కవులవుదామనుకుంటారు కొందరు. కవిత్వాన్ని ఆశ్రయిస్తారు. అనుకున్న భావం అక్షరాల్లో రాదు. ఒదగడు. అయోమయంగా ఉంటుంది. అప్పుడు రచయితలవుతారు. చెప్పాల్సింది చక్కగా చెప్పాననుకుంటారు. కాని వారు కవులుగా ఫెయిలయ్యారన్నది గమనించరు. అలా తనని తాను గమనించుకోని కవే రాంబాబు. మంచి కథా రచయిత అయ్యాడు. అందుకు అభినందనలు. కథలు రాస్తారు కాని, కథకులంతా కథల్లోని పాత్రలుగా ఉండేందుకు ప్రయత్నించరు. మంచో చెడో ఓ వ్యక్తిత్వం ఉండాలి కదా. పాత్రలకి ఉన్నట్టే, పాఠకుడికి ఉన్నట్టే రచయితకీ ఓ వ్యక్తిత్వం అవసరం.
అది నిండుగా ఉన్న వ్యక్తి రాంబాబు. వయసులో చిన్నవాడైన అతని వ్యక్తిత్వానికి చేతులెత్తి నమస్కరించక తప్పదు. ఈ సంకలనంలోని కథలన్నీ కంచికి వెళ్లినవే! కంచికి వెళ్ళినవి అంటే అక్కడి కళావేత్తల ఆమోదం కోసం అర్జీ పెట్టుకున్నవని అర్థం. పూర్వకాలంలో కాంచీనగరం సమస్త విద్యలకు, కళలకు ఆలవాలంగా ఉండేది. అన్ని శాఖలలోని ప్రకవీణులు అక్కడ సమావేశమయ్యేవారు. వారు ఓకే అంటే ఇక తిరుగులేదు. అందుకే కథ కంచికి అని ముగించటం అలవాటు. ఆ అలవాటు కొనసాగిస్తూ రాంబాబు కథలు కంచికి అంటూ, ఇవి మంచి కథలని విన్నవించుకుంటున్నాను."
- జగన్నాథ శర్మ
"కొండంత బాధని గుండెల్లో దాచుకోలేక కవులవుదామనుకుంటారు కొందరు. కవిత్వాన్ని ఆశ్రయిస్తారు. అనుకున్న భావం అక్షరాల్లో రాదు. ఒదగడు. అయోమయంగా ఉంటుంది. అప్పుడు రచయితలవుతారు. చెప్పాల్సింది చక్కగా చెప్పాననుకుంటారు. కాని వారు కవులుగా ఫెయిలయ్యారన్నది గమనించరు. అలా తనని తాను గమనించుకోని కవే రాంబాబు. మంచి కథా రచయిత అయ్యాడు. అందుకు అభినందనలు. కథలు రాస్తారు కాని, కథకులంతా కథల్లోని పాత్రలుగా ఉండేందుకు ప్రయత్నించరు. మంచో చెడో ఓ వ్యక్తిత్వం ఉండాలి కదా. పాత్రలకి ఉన్నట్టే, పాఠకుడికి ఉన్నట్టే రచయితకీ ఓ వ్యక్తిత్వం అవసరం. అది నిండుగా ఉన్న వ్యక్తి రాంబాబు. వయసులో చిన్నవాడైన అతని వ్యక్తిత్వానికి చేతులెత్తి నమస్కరించక తప్పదు. ఈ సంకలనంలోని కథలన్నీ కంచికి వెళ్లినవే! కంచికి వెళ్ళినవి అంటే అక్కడి కళావేత్తల ఆమోదం కోసం అర్జీ పెట్టుకున్నవని అర్థం. పూర్వకాలంలో కాంచీనగరం సమస్త విద్యలకు, కళలకు ఆలవాలంగా ఉండేది. అన్ని శాఖలలోని ప్రకవీణులు అక్కడ సమావేశమయ్యేవారు. వారు ఓకే అంటే ఇక తిరుగులేదు. అందుకే కథ కంచికి అని ముగించటం అలవాటు. ఆ అలవాటు కొనసాగిస్తూ రాంబాబు కథలు కంచికి అంటూ, ఇవి మంచి కథలని విన్నవించుకుంటున్నాను." - జగన్నాథ శర్మ© 2017,www.logili.com All Rights Reserved.