సాయంకాలం అయిదు గంటలు దాటుతోంది. ఆకాశం నల్లగా, పూర్తిగా మేఘావృతమై వుంది. ఎటుచూసినా ఏమీ కన్పించడం లేదు. ఉండుండి భయంకరంగా ఉరుములు... ఎక్కడో పిడుగులు పడుతున్న చప్పుళ్ళు... ఆ వెనుకనే వాటి మధ్యనుంచి తటిళ్ళున ఆ ప్రాంతమంతా గొప్పకాంతిని వెదజల్లుతున్న విద్యుల్లతలు...!
యమునానదికి ఫర్లాంగు దూరంలో... ప్రశాంత వాతావరణంతో నిండివున్న పచ్చని మైదానంలాంటి ప్రదేశంలో నిర్మించబడివుందా కుటీరం లాంటి అందమైన నివాసం. నివాసం చుట్టూ రక రకాల మొక్కల తాలూకూ ఉద్యానవనం... ఆ మొక్కల మధ్యలో అక్కడక్కడ చిత్ర విచిత్రమైన వాసనలని వెదజల్లుతున్న ఔషది మొక్కలు. -
ఆ మధ్యలో కుటీరం నుంచి మెయిన్ రోడ్ వరకూ చక్కని తారురోడ్ వేసి వుంది. నిజానికది ఫార్మ్ హౌస్ వాతావరణాన్ని గుర్తుకు తెచ్చినా అది ఫార్మ్ హౌస్ కాదు... ఎవరో ఋషి తపస్సు చేసుకోవడానికి అనువుగా నిర్మించుకున్న కుటీరాన్ని గుర్తుకు తెస్తోంది.
ఆ కుటీరంలో హాలు లాంటి వెల్ ఫర్నిష్డ్ రూంలో కూర్చుని ఉన్నాడు ఉత్తేజ్. అతని ముందు వున్న టేబుల్ మీద కంప్యూటర్ మానిటర్ వుంది. ప్రక్కనే సి.పి.యు., హియర్ ఫోన్స్, స్కానర్, ప్రింటర్ వున్నాయి. -
కీబోర్డు మీద వున్న అక్షరాల మీద ఉత్తేజ్ చేతి వేళ్ళు చక - చక కదులుతున్నాయి. పావుగంట సేపు అలా నిర్విరామంగా ఫీడ్ చేసి తర్వాత ఆగాడు. తరువాత తను ఫీడ్ చేసిన మాటర్ ని పై నుంచి క్రింద వరకూ ఒకసారి చదువుకున్నాడు.
సాయంకాలం అయిదు గంటలు దాటుతోంది. ఆకాశం నల్లగా, పూర్తిగా మేఘావృతమై వుంది. ఎటుచూసినా ఏమీ కన్పించడం లేదు. ఉండుండి భయంకరంగా ఉరుములు... ఎక్కడో పిడుగులు పడుతున్న చప్పుళ్ళు... ఆ వెనుకనే వాటి మధ్యనుంచి తటిళ్ళున ఆ ప్రాంతమంతా గొప్పకాంతిని వెదజల్లుతున్న విద్యుల్లతలు...! యమునానదికి ఫర్లాంగు దూరంలో... ప్రశాంత వాతావరణంతో నిండివున్న పచ్చని మైదానంలాంటి ప్రదేశంలో నిర్మించబడివుందా కుటీరం లాంటి అందమైన నివాసం. నివాసం చుట్టూ రక రకాల మొక్కల తాలూకూ ఉద్యానవనం... ఆ మొక్కల మధ్యలో అక్కడక్కడ చిత్ర విచిత్రమైన వాసనలని వెదజల్లుతున్న ఔషది మొక్కలు. - ఆ మధ్యలో కుటీరం నుంచి మెయిన్ రోడ్ వరకూ చక్కని తారురోడ్ వేసి వుంది. నిజానికది ఫార్మ్ హౌస్ వాతావరణాన్ని గుర్తుకు తెచ్చినా అది ఫార్మ్ హౌస్ కాదు... ఎవరో ఋషి తపస్సు చేసుకోవడానికి అనువుగా నిర్మించుకున్న కుటీరాన్ని గుర్తుకు తెస్తోంది. ఆ కుటీరంలో హాలు లాంటి వెల్ ఫర్నిష్డ్ రూంలో కూర్చుని ఉన్నాడు ఉత్తేజ్. అతని ముందు వున్న టేబుల్ మీద కంప్యూటర్ మానిటర్ వుంది. ప్రక్కనే సి.పి.యు., హియర్ ఫోన్స్, స్కానర్, ప్రింటర్ వున్నాయి. - కీబోర్డు మీద వున్న అక్షరాల మీద ఉత్తేజ్ చేతి వేళ్ళు చక - చక కదులుతున్నాయి. పావుగంట సేపు అలా నిర్విరామంగా ఫీడ్ చేసి తర్వాత ఆగాడు. తరువాత తను ఫీడ్ చేసిన మాటర్ ని పై నుంచి క్రింద వరకూ ఒకసారి చదువుకున్నాడు.© 2017,www.logili.com All Rights Reserved.