సినిమాకు - మనిషి జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఒక తరం ప్రజల జీవన సరళిని ప్రతిబింబింపజేసేది చలనచిత్రం. అయితే మనిషి జీవితాన్ని ప్రభావితం చేసేది కూడా ఈ సినిమానే. అలా నాటి నుంచి నేటి వరకూ సమాజంపై ప్రభావం చూపిన అనేక మంచి సినిమాలు వందలు, వేలల్లో వచ్చాయి. కొన్ని తరాలు మారినా, దశాబ్దాలు దాటినా మంచి సినిమా ఏదని ఆలోచిస్తే అనేకం మన మెదళ్ళలో కదులుతాయి. అంత మంచి చిత్రంగా బయటకు రావడానికి దర్శకుడు పడే అంతర్మథనం అంతా, ఇంతా కాదు.
ఒక అందమైన శిల్పంలో శిల్పి ప్రతిభ ఉన్నట్టే సినిమా జనం గుండెల్లో నిలిచిపోయేలా చిత్రించడంలో చిత్ర దర్శకుని పాత్ర కూడా అంతే ఉంటుంది. అలా ఆ'పాత' మధురాలుగా నిలిచిపోయే చిత్రాలను నిర్మించిన దర్శకుల గురించి తెలియజేసే ఉద్దేశమే ఈ 'తెలుగు సినీ దర్శకమాలిక.. విజయవీచిక..'
సినిమాకు - మనిషి జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఒక తరం ప్రజల జీవన సరళిని ప్రతిబింబింపజేసేది చలనచిత్రం. అయితే మనిషి జీవితాన్ని ప్రభావితం చేసేది కూడా ఈ సినిమానే. అలా నాటి నుంచి నేటి వరకూ సమాజంపై ప్రభావం చూపిన అనేక మంచి సినిమాలు వందలు, వేలల్లో వచ్చాయి. కొన్ని తరాలు మారినా, దశాబ్దాలు దాటినా మంచి సినిమా ఏదని ఆలోచిస్తే అనేకం మన మెదళ్ళలో కదులుతాయి. అంత మంచి చిత్రంగా బయటకు రావడానికి దర్శకుడు పడే అంతర్మథనం అంతా, ఇంతా కాదు. ఒక అందమైన శిల్పంలో శిల్పి ప్రతిభ ఉన్నట్టే సినిమా జనం గుండెల్లో నిలిచిపోయేలా చిత్రించడంలో చిత్ర దర్శకుని పాత్ర కూడా అంతే ఉంటుంది. అలా ఆ'పాత' మధురాలుగా నిలిచిపోయే చిత్రాలను నిర్మించిన దర్శకుల గురించి తెలియజేసే ఉద్దేశమే ఈ 'తెలుగు సినీ దర్శకమాలిక.. విజయవీచిక..'© 2017,www.logili.com All Rights Reserved.