ఇరవై సంవత్సరాలపాటు తెలుగు అకాడమిలో పరిశోధనశాఖాధిపతిగా పనిచేసినప్పుడు భిన్నశాస్త్రాలకు సంబంధించిన పరిభాషికపదాలను సేకరించి, ఆయా శాస్త్ర విద్వాంసులతో చర్చించి అవసరమైన సందర్భాల్లో పరిభాషను కల్పించటం నా ఉద్యోగవిధుల్లో ఒకటిగా ఉండేది. పదవీవిరమణానంతరం ఈనాడు పత్రికల్లోని భాషాస్వరూపాన్ని అధ్యయనం చేసి 1981 లో ఒక చిన్న గ్రంథంప్రచురించాను. ఆ సంస్థ పత్రికాభాషలోని పారిభాషికాలను సేకరించి ఇంగ్లీషు - తెలుగు పదకోశం సిద్ధం చేయమన్నది.
ఆ ప్రయత్నం ఫలించి 1990 లో 'ఈనాడు వ్యవహారకోశం' వెలువడింది. ఈ దశాబ్దకాలంలో మరికొన్ని వేల పారిభాషికాలను సమకూర్చి పరివర్ధితరూపంలో అదే పదకోశాన్ని పునఃప్రచురించాలని ఆకాంక్షించాను. ఆ కోరిక నేటిదాకా నెరవేరలేదు. పత్రికల్లోనేగాక పాఠ్యగ్రంథాల్లో అనూదితరచనల్లో లభించిన సాంకేతికపదాలను వ్యవహారకోశంలో అంతకుముందు చేరినవాటితో కలిపి, పూర్వప్రచురణలోని దోషాలను చేతనయినంతలో సరిదిద్దుకొని, పరిష్కృత పరివర్ధిత రూపంలో ఈ ఆధునిక వ్యవహారకోశాన్ని ఈ రూపంలో ఇప్పుడు వెలువరిస్తున్నాను.
- బూదరాజు రాధాకృష్ణ
ఇరవై సంవత్సరాలపాటు తెలుగు అకాడమిలో పరిశోధనశాఖాధిపతిగా పనిచేసినప్పుడు భిన్నశాస్త్రాలకు సంబంధించిన పరిభాషికపదాలను సేకరించి, ఆయా శాస్త్ర విద్వాంసులతో చర్చించి అవసరమైన సందర్భాల్లో పరిభాషను కల్పించటం నా ఉద్యోగవిధుల్లో ఒకటిగా ఉండేది. పదవీవిరమణానంతరం ఈనాడు పత్రికల్లోని భాషాస్వరూపాన్ని అధ్యయనం చేసి 1981 లో ఒక చిన్న గ్రంథంప్రచురించాను. ఆ సంస్థ పత్రికాభాషలోని పారిభాషికాలను సేకరించి ఇంగ్లీషు - తెలుగు పదకోశం సిద్ధం చేయమన్నది. ఆ ప్రయత్నం ఫలించి 1990 లో 'ఈనాడు వ్యవహారకోశం' వెలువడింది. ఈ దశాబ్దకాలంలో మరికొన్ని వేల పారిభాషికాలను సమకూర్చి పరివర్ధితరూపంలో అదే పదకోశాన్ని పునఃప్రచురించాలని ఆకాంక్షించాను. ఆ కోరిక నేటిదాకా నెరవేరలేదు. పత్రికల్లోనేగాక పాఠ్యగ్రంథాల్లో అనూదితరచనల్లో లభించిన సాంకేతికపదాలను వ్యవహారకోశంలో అంతకుముందు చేరినవాటితో కలిపి, పూర్వప్రచురణలోని దోషాలను చేతనయినంతలో సరిదిద్దుకొని, పరిష్కృత పరివర్ధిత రూపంలో ఈ ఆధునిక వ్యవహారకోశాన్ని ఈ రూపంలో ఇప్పుడు వెలువరిస్తున్నాను. - బూదరాజు రాధాకృష్ణ© 2017,www.logili.com All Rights Reserved.