బ్రిటిష్ సామ్రాజ్యవాదుల వలస పాలననుండి మాతృదేశాన్ని విముక్తి చేయడానికి 90 సంవత్సరాల సుదీర్ఘపోరాటం సాగింది. 1857 సిపాయిల తిరుగుబాటుతో ప్రథమ స్వాతంత్ర సమరం ప్రారంభమై 1946 నావికుల తిరుగుబాటుతో ముగిసింది. 1947 లో భారతదేశం సర్వస్వతంత్ర దేశంగా అవతరించింది. ఆ తర్వాత కూడా, ఆనాటికి భారతదేశంలో భాగంగాని హైదరాబాదు రాష్ట్రం, కాశ్మీరు, పాండిచేరి, గోవా మొదలైనవి పోరాటం సాగించి మాతృదేశంలో విలీనమయ్యాయి.
ఈ ఉద్యమాలన్నింటిలో ఎన్ని వేలమంది ప్రాణాలర్పించారు? ఎన్ని లక్షలమంది బాధలు, బంధిఖానాలు అనుభవించారు? ఎన్నెన్ని త్యాగాలు చేశారు? అన్నవి చరిత్రకందని సత్యాలు. ఈ సుదీర్ఘ పోరాటం హింసా, అహింసా, అనేక పద్ధతుల్లో జరిగింది. వాస్తవానికి శాంతి ఉద్యమంకంటే సాయుధ సంఘర్షణలే అధికం. ఆ మహోద్యమానికి తమ త్యాగాలతో ఊపిరిలూడిన త్యాగధనులేందరో? రక్తతర్పణ చేసిన వీరజవానులేందరో?వారందరి త్యాగాల ఫలితమే మన స్వతంత్రం.
స్వాతంత్ర సమరవీరుల గాధలు కొన్ని యువతరానికి అందించాలన్న సంకల్పమే ఈ స్వాతంత్ర సమరవీరులు.
- కందిమళ్ళ ప్రతాపరెడ్డి
బ్రిటిష్ సామ్రాజ్యవాదుల వలస పాలననుండి మాతృదేశాన్ని విముక్తి చేయడానికి 90 సంవత్సరాల సుదీర్ఘపోరాటం సాగింది. 1857 సిపాయిల తిరుగుబాటుతో ప్రథమ స్వాతంత్ర సమరం ప్రారంభమై 1946 నావికుల తిరుగుబాటుతో ముగిసింది. 1947 లో భారతదేశం సర్వస్వతంత్ర దేశంగా అవతరించింది. ఆ తర్వాత కూడా, ఆనాటికి భారతదేశంలో భాగంగాని హైదరాబాదు రాష్ట్రం, కాశ్మీరు, పాండిచేరి, గోవా మొదలైనవి పోరాటం సాగించి మాతృదేశంలో విలీనమయ్యాయి. ఈ ఉద్యమాలన్నింటిలో ఎన్ని వేలమంది ప్రాణాలర్పించారు? ఎన్ని లక్షలమంది బాధలు, బంధిఖానాలు అనుభవించారు? ఎన్నెన్ని త్యాగాలు చేశారు? అన్నవి చరిత్రకందని సత్యాలు. ఈ సుదీర్ఘ పోరాటం హింసా, అహింసా, అనేక పద్ధతుల్లో జరిగింది. వాస్తవానికి శాంతి ఉద్యమంకంటే సాయుధ సంఘర్షణలే అధికం. ఆ మహోద్యమానికి తమ త్యాగాలతో ఊపిరిలూడిన త్యాగధనులేందరో? రక్తతర్పణ చేసిన వీరజవానులేందరో?వారందరి త్యాగాల ఫలితమే మన స్వతంత్రం. స్వాతంత్ర సమరవీరుల గాధలు కొన్ని యువతరానికి అందించాలన్న సంకల్పమే ఈ స్వాతంత్ర సమరవీరులు. - కందిమళ్ళ ప్రతాపరెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.