తెలతెలవారుతున్నది. ఆకాశం నిర్మలంగా నీలిరంగులో ఉన్నది. అక్కడక్కడ నక్షత్రాలు కనబడుతున్నాయి. చంద్రుడు నిష్క్రమించడానికి - సూర్యుని రాకకోసం చూస్తున్నాడు.
నెమ్మదిగా తూరుపు దిక్కు ఎరుపెక్కింది. సూర్యకిరణాలు ఊరి చివరనున్న తెల్లని బంగళా పై పడుతున్నవి. ఇంటి చుట్టూ పహరీగోడా - మధ్యలో ఇల్లు - ఇంటి చుట్టూ రకరకాల పూలమొక్కలున్నాయి.
ఇంట్లో రేడియోలో "కౌసల్యా సుప్రజా రామా పూర్వాసంధ్యా ప్రవర్తతే" అని వెంకటేశ్వర సుప్రభాతం వినబడుతున్నది.
జానకమ్మ తలంటి స్నానం చేసి పట్టుచీర కట్టుకొని, నొసట ఎర్రని కుంకుమ బొట్టు పెట్టుకుని ఇంట్లో నుండి బయటకొచ్చింది. ఇంటి ముందున్న తులసి మొక్క చుట్టూ తిరిగి నమస్కరించింది.
ఆమె మధ్య వయస్సులో ఉన్నది. చామనచాయ - ముఖంలో మాతృత్వం - కనబడుతున్నది.
రామనాధం పూజ ముగించుకుని బయటికొచ్చాడు. ఎర్రనిచాయ - ముఖంలో గాంభీర్యం కనబడుతున్నది. తెల్లని దోవతి చేతుల బనియన్ ఎర్రని కాశ్మీరు శాలువా కప్పుకొని వున్నాడు.
ఇంటిముందు స్కూటర్ ఆగిన శబ్దం - వచ్చింది పాలవాడని జానకమ్మకు తెలుసు. అరుగుమీదున్న పాలగిన్నె తీసుకుని వెళ్లి తలుపు తీసింది.
"ఏమిటి బాబు ఇంత ఆలస్యం?" అన్నది.
అతను మాట్లాడకుండా ముసిముసిగా నవ్వాడు.
ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ నవల చదవాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, చదివి ఆనందించండి.
- కె. ప్రతాపరెడ్డి
తెలతెలవారుతున్నది. ఆకాశం నిర్మలంగా నీలిరంగులో ఉన్నది. అక్కడక్కడ నక్షత్రాలు కనబడుతున్నాయి. చంద్రుడు నిష్క్రమించడానికి - సూర్యుని రాకకోసం చూస్తున్నాడు. నెమ్మదిగా తూరుపు దిక్కు ఎరుపెక్కింది. సూర్యకిరణాలు ఊరి చివరనున్న తెల్లని బంగళా పై పడుతున్నవి. ఇంటి చుట్టూ పహరీగోడా - మధ్యలో ఇల్లు - ఇంటి చుట్టూ రకరకాల పూలమొక్కలున్నాయి. ఇంట్లో రేడియోలో "కౌసల్యా సుప్రజా రామా పూర్వాసంధ్యా ప్రవర్తతే" అని వెంకటేశ్వర సుప్రభాతం వినబడుతున్నది. జానకమ్మ తలంటి స్నానం చేసి పట్టుచీర కట్టుకొని, నొసట ఎర్రని కుంకుమ బొట్టు పెట్టుకుని ఇంట్లో నుండి బయటకొచ్చింది. ఇంటి ముందున్న తులసి మొక్క చుట్టూ తిరిగి నమస్కరించింది. ఆమె మధ్య వయస్సులో ఉన్నది. చామనచాయ - ముఖంలో మాతృత్వం - కనబడుతున్నది. రామనాధం పూజ ముగించుకుని బయటికొచ్చాడు. ఎర్రనిచాయ - ముఖంలో గాంభీర్యం కనబడుతున్నది. తెల్లని దోవతి చేతుల బనియన్ ఎర్రని కాశ్మీరు శాలువా కప్పుకొని వున్నాడు. ఇంటిముందు స్కూటర్ ఆగిన శబ్దం - వచ్చింది పాలవాడని జానకమ్మకు తెలుసు. అరుగుమీదున్న పాలగిన్నె తీసుకుని వెళ్లి తలుపు తీసింది. "ఏమిటి బాబు ఇంత ఆలస్యం?" అన్నది. అతను మాట్లాడకుండా ముసిముసిగా నవ్వాడు. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ నవల చదవాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, చదివి ఆనందించండి. - కె. ప్రతాపరెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.