- మహమ్మద్ హనీఫ్
అల్లాహ్... స్త్రీ యా, పురుషుడా..? ముస్లిముల స్వర్గం ముస్లిముల కోసమూ, నరకం ముస్లిమేతరులకోసమా..? మరైతే మహాత్మా గాంధీ గారి పరిస్థితి ఏమిటి? అండమాన్ లోని సెంటనలీస్ తెగవారి పరిస్థితి..? హెల్ సేల్ గా నరకానికేనా..? ఇది అన్యాయం కాదా..? ఖురాన్లో యూదుల గురించి ఎందుకుంది, హిందువుల గురించి ఎందుకు లేదు? ఆర్జీవీ చెప్పని అబ్జెక్టివిజం ఏమిటి..? IS డార్విన్ జీవ పరిణామం ప్రకారం స్త్రీ, పురుషులు సమానమేనా? . స్పెయిన్- ఇండోనేషియా- ఇండియా... వీటిలో కామన్‌గా ఉన్నదేమిటి? చెంఘీజ్ ఖాన్, ముస్లిములందరినీ నామరూపాలు లేకుండా చేస్తానని శపథం చేశాడు. అత్యధిక ముస్లిం రాజ్యాలను జయించాడు, ఖలీఫానూ, లక్షలాది ముస్లిములను చంపాడు. కానీ, అతని నలుగురుమనవళ్లలో, ముగ్గురు ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యారు. ఎలా...? హౌ..? | ఇస్లాం గురించి స్వామీ వివేకానంద, పెరియార్ రామస్వామీలు ఏమన్నారు? సెక్స్ గురించి ఇస్లాం ఏమంటుంది..? మొగోళ్లు నలుగురిని చేసుకోవడమేంది, ఆడోళ్లు ఒక్కర్నే చేసుకోవడమేంది..? ఇదేం న్యాయం..? వందేమాతరం - దేవుని ప్రసాదం - కడప దర్గా... వీటితో ముస్లిములకువచ్చిన ఇబ్బంది ఏమిటి..? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు ఈ పుస్తకంలో దొరుకుతాయి. - మహమ్మద్ హనీఫ్© 2017,www.logili.com All Rights Reserved.