ఈ దేశంలో పోలీసు వ్యవస్థ ఎంత దుర్మార్గంగా మారిపోయిందో, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసేవారిని, భిన్న రాజకీయ విశ్వాసాలు ఉన్నవారిని ఎంతగా వేధిస్తుందో ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ అనుభవం ద్వారా వివరించిన వాస్తవ జీవిత విషాద కథనం ఇది. గౌరవనీయమైన అధ్యాపక వృత్తిలో ఉన్నవారిని కూడ అతి చిన్న కారణంతోనూ, కారణం లేకుండానూ ఎలా నిర్బంధిస్తారో, చిత్రహింసలకు గురి చేస్తారో, తప్పుడు కేసు బనాయించి ఎలా జైలు పాలు చేస్తారో, ఆ వ్యక్తికీ, ఆ వ్యక్తి కుటుంబానికీ ఎంత మానసిక వేదన కల్పిస్తారో వివరించిన ప్రత్యక్ష సాక్షి కథనం ఇది. ఆ వ్యక్తి జైలులో, చీకటి లోకంలో తన చైతన్యం ప్రసరించిన వెలుగులో మరెన్ని హృదయం విదారక, విషాద, బీభత్స దృశ్యాలను గమనించారో, విశ్లేషించారో చెప్పే కథనం ఇది.
- సడ్లపల్లె చిదంబర రెడ్డి