ఒళ్లు నొప్పులొచ్చినా మగ్గం గుంతలో సగం శరీరం పాతి పెట్టినట్లు మోడులా కూలబడి, నేత పని చేస్తూనే ఉండాలి. భార్యాపిల్లల్ని ఇళ్లలో వదిలి అడవుల్లో గొర్రెల్ని కాపలా కాస్తూనే ఉండాలి. పొట్టకూటికోసం మావాళ్లు నేర్చిన గొరవయ్య నృత్యాలకు మీరు కళారూపాలని కితాబిస్తే మురిసి ఆ అడుక్కుతినే ఊబిలోనే ఉండిపోవాలి!
(ఇదీ కథ... నుండి)
శ్రమజీవికి ఆకలి సమస్య కాదు. పని దొరకక పోవడమే అతని సమస్య. సోమరి జీవికి పని చేయడం ఒక సమస్య. ఆకలి మరింత పెద్ద సమస్య. అందుకే నడుం వంచకుండానే చేతికి మన్ను అంటకుండానే కడుపు నింపుకోవడానికి అనాది నుంచీ సోమరిగాడు ఏవో ఎత్తుగడలు వేస్తూనే ఉంటాడు.
(కొల్లబోయినపల్లె... నుండి)
స్వేచ్చగా చెట్టూ చేమల్లో తిరిగే పక్షుల్ని తెచ్చి బంగారు పంజరంలో ఉంచి అన్నిరకాల పళ్లనీ అందించినా ఆ ఆనందం ఏర్పాట్లు చేసినవారికే కానీ పక్షికి లేనట్లు పల్లె నుంచి పట్నానికి చేరిన పెన్నయ్య మనోవ్యాధికి గురి ఐ కాలూచేయీ పడిపోయింది.
(రైతుహృదయం... నుండి)
ఏమి జనాలయ్యా మీరు! పనులు సేసేకి సేతులిచ్చిండాను. ముందుకు నడి సేకి కాళ్లిచ్చిండాను. ఆలోశన సేసేకి తలకాయిచ్చిండాను. కావలసింది తయారు సేసుకోనేకి బూమిచ్చిండాను. ఇట్ల ఒగిటి కాదు రెండుకాదు మీరు అడిగిందంతా ఇచ్చేకి బేజారయితా ఉంది. ఎవరో సూపే దయాదాచ్చిణ్యాల మింద యన్నాళ్లు బతుకుతారు. బతికినా అది మీబతుకెట్ల అయితాది!! ఇంగయినా సొంతంగా బతికేది నేర్చుకొండి.
(రూపాంతరం... నుండి)
కార్తెల కార్యాల కోసం అటుగా వచ్చే నీలి మేఘాలను చెట్ల రెమ్మలు అందాల కొమ్మలయి నిలబెట్టేవి. చిగుళ్ల నోళ్లతో చల్లని పవనాలై పలకరిస్తూ కరిగి వలపుల వానచినుకులయ్యేలా చేసేవి.
(వంచనాశిల్పం... నుండి)
సాంబశివుడి ఆర్థ కథ చదివి కళ్లు చెమ్మగిల్లని వారుండరు. సాంబశివుని గుండె తడిని కలంలో సిరాగా నింపి సడ్లపల్లె చిదంబరరెడ్డి రాశారు. ఇది కథ కాదు ఒక దివ్యాంగుని జీవితం! ఇది అన్ని ప్రపంచ భాషల్లోకి అనువదింపబడాలి. -
-ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం. సినీ నేపథ్య గాయకుడు.