మనస్సంటే తెలిసినది - తెలిసినదంటే అంతవరకూ అనుభవించిందంతా. అది కొలతగా తీసుకుని తెలియనిదానిని తెలుసుకోవాలని ప్రయత్నిస్తాం. కాని తెలియని దానిని తెలిసినది యెప్పటికీ తెలుసుకోలేదు. అనుభవంలోకి వచ్చిన దానిని, తనకు బోధించిన దానిని, తాను సేకరించుకున్నదానిని మాత్రమే అది తెలుసుకోగలదు. తెలియని దానిని తెలుసుకోవడంలో తాను అసమర్ధురాలినన్న సత్యాన్ని మనస్సు చూడగలదా?
తెలియనిదానిని నా మనస్సు తెలుసుకోలేదని నేను బహు స్పష్టంగా చూసినప్పుడు అక్కడ సంపూర్ణమయిన మౌనం వుంటుంది. తెలిసినదాని సామర్థ్యాలతో తెలియని దానిని నేను పట్టుకోగలనని భావించినట్లయితే చాలా గొడవ చేస్తాను, మాట్లాడతాను, కాదంటాను, ఎంపిక చేస్తాను, దానికొక మార్గాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తాను.
- జె. కృష్ణమూర్తి