భగవద్గీతనూ, భగవంతుణ్ణి ఆయుధాలుగా చేసుకొని సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని బాలగంగాధర తిలక్ లాంటి ఆనాటి దేశభక్తులు ప్రయత్నించారు. ప్రజలను కార్యోన్ముఖులను చేయడమే లక్ష్యంగా ఆనాటి స్వాతంత్ర్య సమరయోధులు ప్రయత్నించారు. కానీ నేటి పాలకులూ, పాలకవర్గాల అండతో కాషాయబాబులు కుహనా శాస్త్ర విజ్ఞానాన్ని పెంపొందిస్తున్నారు. "నిర్వికారుడైన" భగవంతుడికి ఆకారాలు సృష్టించి, ఆలయాలు కట్టించి మత ద్వేషాలు రెచ్చగొడ్తున్నారు.
మతాతీత రాజకీయాలు, రాజ్యాంగ వ్యవస్థ స్థానే, మత రాజకీయాలను ప్రోత్సాహిస్తూ రాజ్యవ్యవస్థను ఆయుధంగా వాడుకుంటున్నారు. "లౌకిక" అనే పదానికి "మతాతీత" అనే అర్ధానికి బదులుగా, "లౌక్యంగా మతాన్ని" వాడుకోవడమనే నిర్వచనం చెప్తున్నారు. శాస్త్రజ్ఞానం దగ్గర నుండి, చరిత్ర వరకూ మతం రంగుపూసి కాషాయీకరించాలని పరుగులు పెడుతున్నారు. ఈ రకమైన సంకుచిత లక్ష్యాల విషకౌగిలి నుండి జనాన్ని రక్షించాల్సిన బాధ్యత చైతన్యయుతమైన ప్రతి పౌరుడికీ ఉంది. ఆ బాధ్యతలో భాగంగానే ఈ పుస్తకాన్ని తెలుగు ప్రజలకు తిరిగి అందిస్తున్నందుకు ఆనందంగా ఉంది.
భగవద్గీతనూ, భగవంతుణ్ణి ఆయుధాలుగా చేసుకొని సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని బాలగంగాధర తిలక్ లాంటి ఆనాటి దేశభక్తులు ప్రయత్నించారు. ప్రజలను కార్యోన్ముఖులను చేయడమే లక్ష్యంగా ఆనాటి స్వాతంత్ర్య సమరయోధులు ప్రయత్నించారు. కానీ నేటి పాలకులూ, పాలకవర్గాల అండతో కాషాయబాబులు కుహనా శాస్త్ర విజ్ఞానాన్ని పెంపొందిస్తున్నారు. "నిర్వికారుడైన" భగవంతుడికి ఆకారాలు సృష్టించి, ఆలయాలు కట్టించి మత ద్వేషాలు రెచ్చగొడ్తున్నారు. మతాతీత రాజకీయాలు, రాజ్యాంగ వ్యవస్థ స్థానే, మత రాజకీయాలను ప్రోత్సాహిస్తూ రాజ్యవ్యవస్థను ఆయుధంగా వాడుకుంటున్నారు. "లౌకిక" అనే పదానికి "మతాతీత" అనే అర్ధానికి బదులుగా, "లౌక్యంగా మతాన్ని" వాడుకోవడమనే నిర్వచనం చెప్తున్నారు. శాస్త్రజ్ఞానం దగ్గర నుండి, చరిత్ర వరకూ మతం రంగుపూసి కాషాయీకరించాలని పరుగులు పెడుతున్నారు. ఈ రకమైన సంకుచిత లక్ష్యాల విషకౌగిలి నుండి జనాన్ని రక్షించాల్సిన బాధ్యత చైతన్యయుతమైన ప్రతి పౌరుడికీ ఉంది. ఆ బాధ్యతలో భాగంగానే ఈ పుస్తకాన్ని తెలుగు ప్రజలకు తిరిగి అందిస్తున్నందుకు ఆనందంగా ఉంది.© 2017,www.logili.com All Rights Reserved.