ఆదర్శ కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టి ఆఖరిశ్వాస వరకూ ఆదర్శవంతమైన కమ్యూనిస్టుగా బతికినా ధన్యజీవి కామ్రేడ్ డి శారద పార్టీకోసం సర్వస్వం ధారపోసిన కామ్రేడ్ సుబ్బారావు, కామ్రేడ్ భిక్షావతి దంపతుల కుమార్త ఆమె. నాడు సుందరయ్య, గోపాలన్ వంటి అగ్రనాయకులు అడుగుపెట్టిన వాకిలి వారిది. అయినా ఏనాడు హడావుడి లేకుండా జీవితాంతం పనిచేసిన కార్యకర్త శారద. అందుకే ఈ సాధారణ కార్యకర్తకి అసాధారణ స్పందన వ్యక్తమవుతుంది. ఎస్ ఎఫ్ ఐ, సిఐటియు, మహిళాసంఘం అభివృద్ధి కావటానికి ఆమె అహర్నిశలూ శ్రమించారు. ఈ మూడు రంగాలకు విశాఖలో వారథి ఆమె. భర్త కామ్రేడ్ నరసింగరావుతో కలిసి ఎన్నో నిర్బంధాలు కష్టాలూ ఎదుర్కొన్నారు. శ్రామిక మహిళలను సంఘటితం చేయటంలో, వారి హక్కులపై పోరాడటంలో అవిరళమైన కృషి చేశారు. విశాఖ డెయిరిలో సాగుతున్న అక్రమాలను, ఏకస్వామ్య పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ ధీరోదాత్తంగా పోరాడారు.
ఆదర్శ కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టి ఆఖరిశ్వాస వరకూ ఆదర్శవంతమైన కమ్యూనిస్టుగా బతికినా ధన్యజీవి కామ్రేడ్ డి శారద పార్టీకోసం సర్వస్వం ధారపోసిన కామ్రేడ్ సుబ్బారావు, కామ్రేడ్ భిక్షావతి దంపతుల కుమార్త ఆమె. నాడు సుందరయ్య, గోపాలన్ వంటి అగ్రనాయకులు అడుగుపెట్టిన వాకిలి వారిది. అయినా ఏనాడు హడావుడి లేకుండా జీవితాంతం పనిచేసిన కార్యకర్త శారద. అందుకే ఈ సాధారణ కార్యకర్తకి అసాధారణ స్పందన వ్యక్తమవుతుంది. ఎస్ ఎఫ్ ఐ, సిఐటియు, మహిళాసంఘం అభివృద్ధి కావటానికి ఆమె అహర్నిశలూ శ్రమించారు. ఈ మూడు రంగాలకు విశాఖలో వారథి ఆమె. భర్త కామ్రేడ్ నరసింగరావుతో కలిసి ఎన్నో నిర్బంధాలు కష్టాలూ ఎదుర్కొన్నారు. శ్రామిక మహిళలను సంఘటితం చేయటంలో, వారి హక్కులపై పోరాడటంలో అవిరళమైన కృషి చేశారు. విశాఖ డెయిరిలో సాగుతున్న అక్రమాలను, ఏకస్వామ్య పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ ధీరోదాత్తంగా పోరాడారు.© 2017,www.logili.com All Rights Reserved.