నేను ఎనభై ఏళ్లకు పైబడ్డ నా జీవితంలో అరవై ఏళ్లకు పైగా ఎందరితోనో కలిసి పనిచేశాను. ఎన్నో సంఘటనలు దగ్గరుండి చూశాను. భిన్నమనస్తత్వాలుగల వ్యక్తులతో వ్యవహరించాను. చాలా విషయాలు తెలుసుకున్నాను. సామాజిక జీవితం గురించి కొంత అవగాహనా ఏర్పడింది. సామాన్య జీవితాల నుంచి, సామాన్య సంఘటనలనుంచి తెలుసుకోదగిన జీవితసత్యాలు, నేర్చుకోదగిన గుణపాఠాలు ఉంటాయని అర్థమైంది.
ప్రతి అనుభవమూ జ్ఞానదాయకమే. కనుక నా స్వీయచరిత్ర అని కాకుండా 'జ్ఞాపకాల వరద'గా అక్షరరూపమిద్దామని కలగాపులంగా ఉండవచ్చునని చెప్పడానికి కూడా ఉపయోగించాను. నా అనుభవాలనేగాక, నా పరిశీలనలను, నా స్పందనలను, నా నిర్ధారణలను సత్యనిష్ఠతో, నిర్దిష్టతకు భంగం కలుగకుండా పొందుపరచే ప్రయత్నం చేశాను. పత్రికారచనలో నేను దీక్షతో పాటించినదీ, బోధించినదీ ఈ సూత్రమే.
నేను ఎనభై ఏళ్లకు పైబడ్డ నా జీవితంలో అరవై ఏళ్లకు పైగా ఎందరితోనో కలిసి పనిచేశాను. ఎన్నో సంఘటనలు దగ్గరుండి చూశాను. భిన్నమనస్తత్వాలుగల వ్యక్తులతో వ్యవహరించాను. చాలా విషయాలు తెలుసుకున్నాను. సామాజిక జీవితం గురించి కొంత అవగాహనా ఏర్పడింది. సామాన్య జీవితాల నుంచి, సామాన్య సంఘటనలనుంచి తెలుసుకోదగిన జీవితసత్యాలు, నేర్చుకోదగిన గుణపాఠాలు ఉంటాయని అర్థమైంది. ప్రతి అనుభవమూ జ్ఞానదాయకమే. కనుక నా స్వీయచరిత్ర అని కాకుండా 'జ్ఞాపకాల వరద'గా అక్షరరూపమిద్దామని కలగాపులంగా ఉండవచ్చునని చెప్పడానికి కూడా ఉపయోగించాను. నా అనుభవాలనేగాక, నా పరిశీలనలను, నా స్పందనలను, నా నిర్ధారణలను సత్యనిష్ఠతో, నిర్దిష్టతకు భంగం కలుగకుండా పొందుపరచే ప్రయత్నం చేశాను. పత్రికారచనలో నేను దీక్షతో పాటించినదీ, బోధించినదీ ఈ సూత్రమే.© 2017,www.logili.com All Rights Reserved.