ఇలా పరమభక్తుడైన బసవన్న కూడల సంగమదేవుని ప్రార్థించాడు. ఆయన దృష్టిలో ఇది జీవితపు సార్థకత కూడ. ఆయన ఈ ఆశయం దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ సిద్ధించింది. భక్తుడైన కనకదాసులవారిని నేడు శబర, నాయక, కురుబ కులస్థులు 'అతను మావాడు, అతను మావాడు' అని తమ హక్కును వినియోగిస్తున్నారు. అలాంటి సార్థకమైన జీవితాన్ని గడిపిన ఆ కనకదాసులవారు ఎవరు? ఆయన నేపథ్యం ఏమిటి? ఎక్కడి వారు? ఏ కాలంలో జీవించారు? ఆయన జీవిత విశేషాలకు సంబంధించి ఎంతవరకు సమాచారం లభిస్తుంది. - ఇత్యాది విషయాలను ఒకసారి పరిశీలించాలి.
దాదాపు వేయి సంవత్సరాల కన్నడ సాహిత్యచరిత్రను గమనిస్తే సామాజిక దృష్టికలిగిన రెండు ప్రముఖదశలు కన్పిస్తాయి. ఒకటి, పన్నెండవ శతాబ్దంలో శివశరణుల 'వచనసాహిత్య' యుగం. రెండోది, పదిహేనవ శతాబ్దంనుంచీ ప్రారంభమయ్యే హరిదాసులు 'దాససాహిత్య' యుగం. ఈ రెండూ కన్నడ సాహిత్య సంప్రదాయంలో సువర్ణాధ్యాయాలు. విప్లవాత్మకమైన జీవనతత్త్వాన్నీ, ఆదర్శప్రాయమైన విచ్చేనల్నీ సామాన్య జనులకు అర్థమయ్యేరీతిలో కన్నడిగులకు బోధించినవాళ్ళు శరణులు, హరిదాసులు. మాటల్లో, నడవడుల్లో ఒకటిగా జీవించిన వీళ్ళ జీవితం వీళ్ళ బోధనలలాగనే ప్రజలకు ఆదర్శప్రాయమైంది. ఈ రెండు సాహిత్య సంప్రదాయాలు, దేశప్రజల జీవితాలు రాజకీయంగా, ధార్మికంగా, సామాజికంగా కష్టాలకు లోనైనప్పుడూ; సాంస్కృతికంగా అతిక్రమించిన పరమతస్థులు గావించిన మతాంతరాలు, బలాత్కారాలు, హత్యలు, దోపిడులు ప్రజల దైనందిన జీవితాన్ని అస్తవ్యస్థం చేసిన దశలోనే ఆవిర్భవించాయి.................
నేపథ్యం వీడెవ్వడు వీడెవ్వడు వీడెవ్వడని పలికింపకయ్య నావాడు నావాడు నావాడితడని పలికింపుమయ్య ఇలా పరమభక్తుడైన బసవన్న కూడల సంగమదేవుని ప్రార్థించాడు. ఆయన దృష్టిలో ఇది జీవితపు సార్థకత కూడ. ఆయన ఈ ఆశయం దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ సిద్ధించింది. భక్తుడైన కనకదాసులవారిని నేడు శబర, నాయక, కురుబ కులస్థులు 'అతను మావాడు, అతను మావాడు' అని తమ హక్కును వినియోగిస్తున్నారు. అలాంటి సార్థకమైన జీవితాన్ని గడిపిన ఆ కనకదాసులవారు ఎవరు? ఆయన నేపథ్యం ఏమిటి? ఎక్కడి వారు? ఏ కాలంలో జీవించారు? ఆయన జీవిత విశేషాలకు సంబంధించి ఎంతవరకు సమాచారం లభిస్తుంది. - ఇత్యాది విషయాలను ఒకసారి పరిశీలించాలి. దాదాపు వేయి సంవత్సరాల కన్నడ సాహిత్యచరిత్రను గమనిస్తే సామాజిక దృష్టికలిగిన రెండు ప్రముఖదశలు కన్పిస్తాయి. ఒకటి, పన్నెండవ శతాబ్దంలో శివశరణుల 'వచనసాహిత్య' యుగం. రెండోది, పదిహేనవ శతాబ్దంనుంచీ ప్రారంభమయ్యే హరిదాసులు 'దాససాహిత్య' యుగం. ఈ రెండూ కన్నడ సాహిత్య సంప్రదాయంలో సువర్ణాధ్యాయాలు. విప్లవాత్మకమైన జీవనతత్త్వాన్నీ, ఆదర్శప్రాయమైన విచ్చేనల్నీ సామాన్య జనులకు అర్థమయ్యేరీతిలో కన్నడిగులకు బోధించినవాళ్ళు శరణులు, హరిదాసులు. మాటల్లో, నడవడుల్లో ఒకటిగా జీవించిన వీళ్ళ జీవితం వీళ్ళ బోధనలలాగనే ప్రజలకు ఆదర్శప్రాయమైంది. ఈ రెండు సాహిత్య సంప్రదాయాలు, దేశప్రజల జీవితాలు రాజకీయంగా, ధార్మికంగా, సామాజికంగా కష్టాలకు లోనైనప్పుడూ; సాంస్కృతికంగా అతిక్రమించిన పరమతస్థులు గావించిన మతాంతరాలు, బలాత్కారాలు, హత్యలు, దోపిడులు ప్రజల దైనందిన జీవితాన్ని అస్తవ్యస్థం చేసిన దశలోనే ఆవిర్భవించాయి.................© 2017,www.logili.com All Rights Reserved.