మనిషి బుద్ధిజీవి కాబట్టి, యీ భూగోళం దానిపైని సమస్త జీవనకోటి తన కోసమేనని అనుకుంటాడు. ఇతర ప్రక్రుతి వనరులు, భూగర్భ సంపదలతో సహా తనవేనననే భ్రమలో ఉంటాడు. అన్నిటితో పాటు తనూ ఒక జీవినని ఎప్పుడు అనుకోడు.
అందుకని సృష్టిలోని సమస్త చరాచర వస్తుకోటితో మనకు సంబంధాలు వుండి తీరుతాయి. అందుకే మానవ సంబంధాలను ఎంచుకున్నాను. వీటిని దేనిలోనైనా ముదిమిపెట్టవచ్చు. ఈ గోళంలో జడచేతన పదార్థాలు అయిపోతే మరో గ్రహానికి వెళ్లి సంబంధాలను కొనసాగించవచ్చు. దీని వల్ల రచనా వస్తువుకి కరువు ఇప్పట్లో రాదని మీలాగే నేను నమ్మికతో వున్నాను. దేవులపల్లి కృష్ణమూర్తి శాస్త్రి ఒక కవితా సంపుటిని ఆవిష్కరిస్తూ - "మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే యీ కవిగారి రచనలలో అక్కడక్కడ కవిత్వం కూడా కనిపిస్తుంది" అని స్పష్టం చేసారు. అలాగే మీరు యీ పుస్తకంలోని వ్యాస పరంపరను శ్రద్దగా చదివినట్లయితే, అక్కడక్కడ హాస్యం కూడా తగులుతుందని మనవి చేస్తున్నాను.